Amit Shah and JP Nadda Andhra Pradesh Tour: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్‌కి రానున్నారు.. ఈనెల 10వ తేదీన శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా అధ్వర్యంలోభారీ బహిరంగ సభ నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది.. ఈ విషయాన్ని ఈ రోజు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు.. దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరిగాయి.. జరుగుతున్నాయన్న ఆయన.. వైసీపీ అవినీతి, అక్రమాలను సభల ద్వారా ప్రజలకు వివరిస్తాం అన్నారు.. అభివృద్ధిలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న ఆయన.. పుట్టిన ప్రతిబిడ్డపై రెండు లక్షల రూపాయల అప్పు తెచ్చిన ఘనుడు సీఎం జగన్ అంటూ ఎద్దేవా చేశారు.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు.. ప్రతి పనిలోను అవినీతి, ప్రతి కంపెనీకి వైసీపీ కార్యకర్తలే యజమానులు అని విమర్శించారు.. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారని మండిపడ్డారు.. ఇక, జనసేనతో కలిసే ముందుకు వెళుతున్నాం అని స్పష్టం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్.
Read also: Ponguleti Sudhakar Reddy: ప్రజలను భ్రమలో పెట్టే కార్యక్రమమే ఈ నీళ్ళ పండుగ
మరోవైపు.. ఉద్యోగులను మోసం చేశారంటూ సీఎం వైఎస్ జగన్‌పై ధ్వజమెత్తారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి.. మాట తప్పను.. మడమ తిప్పను.. అన్న జగన్ హామీలు ఏమయ్యాయి? అని నిలదీశారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతను వైఎస్ జగన్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.. నెరవేర్చలేని హామీలను జగన్ ఎందుకు ఇచ్చారు..? అంటూ ప్రశ్నించారు విష్ణువర్ధన్‌రెడ్డి. కీలకమైన అనేక మంది నేతలతో పాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా శ్రీకాళహస్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. చిత్తూరు జిల్లా నేతలతో సమావేశం అనంతరం బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారని వివరించారు విష్ణు వర్ధన్. ఇక, కేంద్రమంత్రి అమిత్ షా విశాఖ పర్యటన ఈనెల 11వ తేదీకి మార్పు చేయడం జరిగిందని, ఆ రోజు ఉదయం కోయంబత్తూరు బహిరంగ సభలో పాల్గొని అనంతరం విశాఖ సభలో పాల్గొంటారని బీజేపీ నేత సీఎం రమేష్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం జేపీ నడ్డా తిరుపతికి చేరుకుంటారని, ప్రధాని మోడీ పాలనలో జరిగిన అభివృద్ధిని 10వ తేదీ శ్రీకాళహస్తిలో జరిగే బహిరంగ సభలో నడ్డా వివరిస్తారని తెలిపారు.