NTV Telugu Site icon

CM Chandrababu: వరద బాధితులకు చిన్నారుల సాయం.. సీఎం చంద్రబాబు అభినందనలు

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: ఏపీలో వరదలు ప్రజలను ఉక్కిరిబిక్కరి చేశాయి. ఈ క్రమంలో వరద బాధితుల కోసం ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా తమకు తోచినంత విరాళంగా అందజేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులు కూడా తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. వరద బాధితులకు చిన్నారి విద్యార్థుల విరాళంపై సీఎం నారా చంద్రబాబు అభినందనలు తెలిపారు. పాకెట్ మనీని వరద సాయంగా ఇవ్వడంపై ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

Read Also: Pawan Kalyan: గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పర్యటన

చిన్నారులు తమ ప్యాకెట్ మనీని వరద సాయం ఇస్తున్న వీడియో చూసి చాలా సంతోషమేసిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా విప్పర్రులోని శ్రీ విద్యా నికేతన్ పాఠశాలకు చెందిన చిన్నారులు వరద సాయం అందించే విషయంలో పెద్ద మనస్సు చేసుకున్నారని కొనియాడారు. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించేలా చేసిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తున్నామన్నారు. బాధితుల పట్ల శ్రద్ధ వహించాలని బోధించడం ఇప్పటి తరానికి అవసరమని సీఎం అన్నారు. ఇలాంటి సంఘటనలే మానవత్వంపై మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయన్నారు.

Show comments