Monthly Pension: పెళ్లికాని వారికి పెన్షన్ ఇచ్చేది అప్పటి నుంచే.. క్లారిటీ ఇచ్చిన సీఎం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం ఇప్పటి వరకు వితంతువులకు, వృద్ధులకు, దివ్యాంగులు పెన్షన్లు ఇవ్వడం చూశాం.. కానీ గత కొన్ని రోజులుగా నిరుద్యోగులకు భృతి ఇస్తామనే హామీ దేశంలో చక్కర్లు కొడుతుంది. నిజానికి ఇది పాలిటిక్స్ లో ఒక ట్రెండుగా మారింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా, నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రతి పార్టీ మేనిఫెస్టోలో పెడుతుంది. ఇక ఇదే వరుసలో మరో ట్రెండ్ వస్తుంది. అదేనండి పెళ్లికాని వారికి నెలవారి పెన్షన్ ఇస్తామని హర్యానా ప్రభుత్వం తెలిపింది. ఆడవారైనా, మగవారైనా.. ఎవరికైనా ఈ పథకం వర్తిస్తుందని ఇవాళ (గురువారం) ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.
Also Read: Early Elections in Andhra Pradesh: ఏపీలో మందస్తు ఎన్నికలు..? క్లారిటీ ఇచ్చిన సజ్జల
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
ఈ పథకం వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ వెల్లడించారు. అయితే దీనికి కొన్ని షరతుల్ని ఆయన ప్రకటించారు. వయసు 45 దాటి 60 ఏళ్ల లోపు వారికి ఈ పథకం వర్తిస్తుందన్నాడు. అలాగే వారి వార్షికాదాయం రూ. 1.8 లక్షల లోపు ఉండే వారికి నెలకు 2,750 రూపాయల పెన్షన్ అందజేయనున్నట్లు ఖట్టర్ తెలిపారు. వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించని అదే వయస్సు గల వితంతువులకు, భార్య చనిపోయిన వారికి కూడా ఈ పెన్షన్ వర్తిస్తుందని సీఎం చెప్పారు.
Also Read: NDA Meeting: జూలై 18న ఎన్డీఏ మీటింగ్.. కలిసి వెళ్లేది ఎవరు..?
అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్‌ను సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలియజేశారు. ఒంటరి పురుషుడు, స్త్రీ విషయంలో కొన్ని వ్యక్తిగత అవసరాలు ఉన్నాయి. ఈ నెలవారీ పెన్షన్‌తో ప్రభుత్వం వైపు నుంచి కొంత ఆర్థిక సహాయం వారికి అందాలని ఆయన అన్నారు. పెన్షన్ స్కీమ్‌తో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 240 కోట్లను భరిస్తుందని చెప్పారు.
Also Read: Man Attack on Shopkeeper : దోశ వేయలేనన్న మహిళపై దాడి..
అయితే, హర్యానాలో దాదాపు 65,000 మంది పెళ్లికాని స్త్రీ, పురుషులు ఉన్నాట్లు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇక నిర్దిష్ట వయస్సుగల వితంతువులు/భార్య చనిపోయిన మగవారు 5,687 మంది ఉన్నారని ఆయన అన్నారు. వీరందరికి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ఈ లబ్ధిదారులకు 60 ఏళ్లు నిండిన తర్వాత వృద్ధాప్య పింఛను పథకానికి సంబంధించిన వార్షిక ఆదాయ వివరాలను సమర్పిస్తే.. అప్పటి నుంచి వారు వృద్ధాప్య పింఛను పొందుతారని సీఎం ఖట్టర్ చెప్పారు.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!