NTV Telugu Site icon

CM KCR: మెదక్ కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Kcr

Kcr

సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదటగా జిల్లాకు చేరుకున్న కేసీఆర్ ముందుగా బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన దేవుళ్ల చిత్రపటాల దగ్గర పూజ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలు వేసి ఆయనను ఆశీర్వదించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ ను కేసీఆర్ ఓపెనింగ్ చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీశ్‌రావు, హోంమంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ శాంతికుమారి, డీజీపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, మెదక్‌ జిల్లా నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: Shridhar Babu: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ కల్పనలో విఫలం

మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. 32 ఎకరాల విస్తీర్ణంలో 67.07 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం.. 2018 మే 9న జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. జీ ప్లస్ 2 పద్దతిలో నాలుగు బ్లాకులుగా కలెక్టరేట్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. జిల్లా కలెక్టర్, ఇద్దరు అడిషనల్ కలెక్టర్ నివాసాలతో పాటు 8 మంది జిల్లా అధికారులకు గృహాలు నిర్మించామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో దివ్యంగులకు 4016 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. మెదక్ జిల్లాలో టెకె దార్ పెన్షన్లు కేసీఆర్ పంపిణీ చేశారు.

Read Also: Delhi Airport: రెండు విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్ క్లియరెన్స్.. తప్పిన పెనుప్రమాదం

గతంలో తెలంగాణలో ఉన్న కలెక్టరేట్ లను చూస్తే దారుణంగా ఉన్నాయని.. వాటిని ఇప్పుడు తిరిగి నిర్మించుకోవడం వల్ల ప్రజలకు ఒకే దగ్గర అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే మనం రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుందో లేదో వాళ్లకు కనబడటం లేదని ప్రతిక్షాలపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు.