CM KCR Tour in Warangal Today
నేడు వరంగల్ లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దామెరలో ప్రతిమ వైద్యకళాశాల, ఆస్పత్రిని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అయితే.. వరంగల్ లో సీఎం కేసిఆర్ నాలుగు గంటల పర్యటన కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్‌కు సీఎం కేసీఆర్ బయలు దేరుతారు. ఉదయం 11.15 గంటలకు వరంగల్ కి చేరుకోనున్న సీఎం.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు.
అనంతరం.. ములుగు రోడ్డులో జాతీయ రహదారి 163 పక్కన నిర్మించిన ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత 2 గంటలకు అక్కడి నుంచి తిరిగి బయలుదేరి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.