NTV Telugu Site icon

CM KCR : నేడు సంగారెడ్డిలో సీఎం కేసీఆర్ పర్యటన

Cm Kcr

Cm Kcr

నేడు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కొల్లూరులో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్ కేసీఆర్ నగర్ ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 145 ఎకరాల విస్తీర్ణంలో 1489.29 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15,660 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆరుగురు లబ్ధిదారులు ఇళ్ల పట్టాలు అందుకొనున్నారు.

Also Read : Assam Floods: అస్సాంలో వరదలు.. 20 జిల్లాల్లో 1.20 లక్షల మందిపై ప్రభావం..

సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న మేధా రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కొండకల్‌లో దాదాపు 100 ఎకరాల స్థలంలో వెయ్యి కోట్ల రూపాయలతో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని మేధా సంస్థ నిర్మించింది. పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేయనున్నారు. 200 పడకలతో 184.87 కోట్ల రూపాయల వ్యయంతో ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు.

Also Read : ODI World Cup 2023: భారత అభిమానులకు శుభవార్త.. టీమిండియాలోకి ఎంఎస్‌ ధోనీ ఎంట్రీ!