NTV Telugu Site icon

BRS Public Meeting : యాదాద్రి నుంచి ఖమ్మం బయలు దేరిన సీఎంలు

Cm Kcr

Cm Kcr

సీఎం కేసీఆర్‌ సహా ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఖమ్మం బయలుదేరారు. అయితే ఇప్పటికే సీఎంల యాదాద్రి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. మరికాసేపట్లో ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రివాల్‌, భగవంత్‌ మాన్‌, పినరయి విజయన్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ నేత డీ.రాజా ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రికి చేరుకున్నారు. అనంతరం పినరయి విజయన్‌, రాజా మినహా మిగిలిన నేతలు యాదాద్రి లక్ష్మినరసింహా స్వామి వారిని దర్శించుకున్నారు.

Also Read : Errabelli Dayakar Rao: నేను చెప్పింది అలా కాదు.. నా మాటలను వక్రీకరించారు

గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆ తర్వాత నలుగురు ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు కలిసి ఖమ్మం బయలుదేరారు. అక్కడ నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించారు. తర్వాత సీఎం కేసీఆర్‌తోపాటు ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం ఆరుగురికి కళ్ల అద్దాలు అందిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. టీఆర్ఎస్ కాస్తా… జాతీయ పార్టీగా అవతరించేందుకు భారత రాష్ట్ర సమితి (BRS) ఢిల్లీలో ఏర్పాటైనా.. ఆవిర్భావ సభ ఇంతవరకూ జరగలేదు. దానికి ఇవాళ ఖమ్మంలో ముహూర్తం. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ చాలా వ్యూహాలు రచిస్తోంది.

Also Read : Custody: ‘రేవతి’గా మారిన బేబమ్మ… కటకటాల వెనక్కి ఎందుకు వెళ్లింది?