NTV Telugu Site icon

CM KCR: సింగరేణిని ముంచింది కాంగ్రెస్సే.. ప్రజలు విచక్షణతో ఓటేయాలి..

Cm Kcr

Cm Kcr

CM KCR: చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని మందమర్రిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ గడ్డ చైతన్య వంతమైనదని, ఓటు విచక్షణతో వేయాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు. అభ్యర్థి గుణ గణాలు, పార్టీ చరిత్ర చూడాలన్నారు. 24 ఏళ్ల కింద పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్ కు బాస్ తెలంగాణ ప్రజలేనని ఆయన చెప్పారు. ఇతర పార్టీలలాగా ఢిల్లీ బాస్‌లు లేరన్నారు. ఈ సందర్భంగా సింగరేణిని ప్రైవేటీకరించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని సీఎం అన్నారు. కేంద్రం వద్ద అప్పులు తెచ్చి సింగరేణిలో 49 శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్సేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సింగరేణిని ముంచింది కాంగ్రెస్సే అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

Also Read: Tirumala: రూటు మార్చిన వేటగాళ్లు.. కుక్కలతో వన్య ప్రాణుల వేట..

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. “సింగరేణిలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. 10 బిలియన్ టన్నుల బొగ్గు ఉంది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు కేంద్రంకు వాటా ఇచ్చింది. సింగరేణిని ఎవ్వరు అమ్మారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. పరిపాలన చేతకాక కేంద్రంకు 49 శాతం ఇచ్చారు. సింగరేణిలో దసరా, దీపావళి బోనస్‌ రూ.వెయ్యి కోట్లు పంచుతున్నాం. సింగరేణిని ముంచింది కాంగ్రెస్ పార్టీనే. మోడీకి ప్రైవేట్ పిచ్చి పట్టింది. బొగ్గును అమ్ముకుందాం అని చూస్తే అడ్డుకున్నాం. కాంగ్రెస్ ఇన్ని రోజులు రైతుల గురించి ఆలోచన చేయలేదు. సూటికేసులతో వచ్చిన వారు కావాలా… జేబులో డబ్బులు లేని వారు కావాలా. ఎన్నికలు రాగానే జనం గుర్తుకు వస్తారు. డబ్బుల బాపతు వస్తారు. అలాంటి వారందరికీ బుద్ది చెప్పాలి. భారతదేశంలో పొలికేక దళితబంధు. ప్రతి కుటుంబానికి దళితబంధు అందించే వరకు బీఆర్‌ఎస్ ఊరుకోదు.ఆఖరికి అంబేడ్కర్‌ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీనే. సుమన్ నాబిడ్డ లాంటి వొడు. నా ఇంట్లో ఉంటాడు. పార్టీలు మార్చే సూటికేసు వాళ్ళు కావాలా సుమన్ కావాలా నిర్ణయించుకోవాలి. డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు. మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇంకా పరిణతి రావాలి. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి.” అని సీఎం కేసీఆర్ అన్నారు.

 

Show comments