CM KCR : మోడీ మా జీవోను గౌరవిస్తావా.. దాన్నే ఊరితాడు చేసుకుంటావా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండా ఎగురవేశారు. వేదిక అధ్యక్షురాలిగా మంత్రి సత్యవతి రాథోడ్ వ్యవహరించారు. ఈ సభకు భారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, గిరిజనులు, బంజారాలు హాజరయ్యారు. గిరిజనులకు గిరిజన భాషలోనే ప్రణామాలు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రూ.60 కోట్లతో ఆదివాసీ బంజారా భవన్, సంత్ సేవాలాల్ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా వుందన్నారు. చాలా సమస్యలు వున్నాయని, శాస్త్రీయ దృక్పథంతో ముందుకెళతామని, మేథోమథనం చేయాలన్నారు సీఎం కేసీఆర్. మీరందించే సూచనలు, సలహాలు ఇవ్వాలని, అన్ని రకాల చర్యలు ప్రభుత్వం చేపడుతుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ వచ్చి విభజన రాజకీయం నడిపిస్తున్నారని ఆయన బీజేపీపై మండిప్డడారు. గిరిజన రిజర్వేషన్ ఎందుకు అమలు కావడం లేదని, గిరిజన బిడ్డలకు న్యాయం చేయండి. ప్రధాని మోడీ పుట్టినరోజు.. ఆయనకు చేతులు జోడించి అడుగుతున్నా అని సీఎం కేసీఆర్ అన్నారు.
Also Read
మోడీ మా జీవోను గౌరవిస్తా.. దాన్నే ఊరితాడు చేసుకుంటావా అనిఆయన మండిపడ్డారు. మా బిల్లుకు రాష్ట్రపతి స్టాంప్ వేయించి పంపండని, రాష్ట్రపతిగా గిరిజన బిడ్డ వున్నారని, ఆమె ఆపరన్నారు సీఎం కేసీఆర్. ద్రౌపది ముర్ము వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చేయండని, రాజ్యాంగంలో ఎక్కడా కూడా 50 శాతం రిజర్వేషన్ వుండకూడదని ఎక్కడా లేదు. పక్కన తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ వుంది. ఈ సభ తీర్మానం చేస్తోంది. గిరిజనులకు రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం ఇవ్వాలి. వినపడుతోందా అమిత్ షా గారూ.. ప్రధాని నరేంద్ర మోడీ గారు. మీకు వినిపిస్తోందా? మీకున్న ప్రతిబంధకం ఏంటి? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!