CM KCR : నన్ను సీఎం చేసింది, ఇంత ఎత్తుకు పెంచింది సిద్దిపేట గడ్డే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలోనే నేడు సిద్ధిపేటలో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సిద్దిపేట ఊళ్ళల్లో ఎవరైనా ఉన్నారా అందరూ ఈ సభకే వచ్చారా అని అన్నారు. లెక్కపెట్టలేనంత మంది వచ్చారని, జనని జన్మ భూమిచ్చా స్వర్గదపి గరీయసి.. సిద్దిపేట పేరు విన్న, చూసిన నాకు కలిగే భవన ఇది అని ఆయన అన్నారు. నన్ను సీఎం చేసింది, ఇంత ఎత్తుకు పెంచింది సిద్దిపేట గడ్డేనని, నన్ను ఇంత వాడిని చేసినా నా మాతృభూమికి నమస్కారమన్నారు కేసీఆర్.
అంతేకాకుండా.. ‘ఈ గడ్డ రుణం నేము ఏమిచ్చినా తీర్చుకోలేను. తన పాత మిత్రులను గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్. మిషన్ భగీరథ అమలు అవుతున్నది అంటే సిద్దిపేట వేదికగా నేను పెట్టిన పథకమే. చింతమడకలో నేను చిన్న వాణ్ణి ఉన్నప్పుడు నాకు తాగడానికి పాలు లేకపోతే ఓ ముదిరాజ్ తల్లి నాకు పాలు పట్టింది. ఆనాడు సాగు నీళ్లు లేని సిద్దిపేటకి మొండి ధైర్యంతో మీ దివేనలతో ముందుకు వెళ్లిన. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది సిద్దిపేట గడ్డనే. నేను ఎక్కడికి పోయినా కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని మొక్కి పోతా. సిద్దిపేట ఎలా అభివృద్ధి జరిగిందో చెబితే హరీష్ రావుని పొగిడినట్టు అవుతుంది. నేను ఉప ఎన్నిక కోసం కరీంనగర్ వెళ్తే ఆరడుగుల బులెట్ హరీష్ రావుని మీకు ఇచ్చి పోయిన. హరీష్ రావు మీద మన మంత్రులు జోక్ వేస్తారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఏడన్న ఏమైనా కనిపిస్తే అది సిద్దిపేట లో పెట్టుకుంటాడు. సిద్దిపేట లో నేను ఉన్న హరీశ్ రావు చేసినంత అభివృద్ధి నేను చేయకపోదును. సిద్దిపేట కి ఒక్కటే తక్కువ ఉన్నది అది విమానం రావడమే. సిద్దిపేటలో లేనిదంటూ ఏమి లేదు. సిద్దిపేటకి పట్టుబట్టి హరీష్ రావు ఐటీ హబ్ తెచ్చాడు. తెలంగాణలోనే సిద్దిపేట కి ప్రత్యేక గౌరవం ఇచ్చారు. హరీష్ ని లక్ష మెజారిటీతో గెలిపించారు. ఈ సారి కూడా హరీష్ కే ఎక్కువ మెజారిటీ రావాలి. దళిత బంధు పథకానికి ప్రేరణ నాకు సిద్దిపేట లో జరిగిన ఘటనే ఉదాహరణ. ఈ దిక్కుమాలిన దరిద్రపు కాంగ్రెస్ దళితుల కోసం ఏమి చేయలేదు. దళితులకు విడతల వారిగా న్యాయం చేస్తాం. తెలంగాణ భారతదేశానికి తలమానికం అయితే సిద్దిపేట మాత్రం యావత్తు తెలంగాణకే తలమానికం. హరీష్ రావు బాగా పని చేస్తున్నాడు. మాల్లోక్కసారి హరీష్ రావుని మెజారిటీ దాటిపించి గెలిపించాలి.’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?