NTV Telugu Site icon

CM KCR : కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా.. దేశ రాజధానిలోనే నీరు, విద్యుత్ సంక్షోభం ఉంది

Kcr Speech

Kcr Speech

తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నప్పటికీ దేశాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు సీఎం కేసీఆర్‌. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ .. నిధులను నిలిపివేయడం, ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) పరిమితులపై కోత విధించడంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. తెలంగాణపై కేంద్రం అన్ని విధాలా వివక్ష చూపుతోందని, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా యువత, మేధావులు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రంపై వ్యతిరేకంగా పోరాడాలని కోరారు.

Also Read : Satyavati Rathod : షర్మిల శిఖండి రాజకీయాలు మానుకోవాలి
దేశాన్ని అభివృద్ధి చేయడం కంటే విద్వేషాలు రెచ్చగొట్టి, మత విద్వేషాలు సృష్టించి అధికారంలో కొనసాగాలని మాత్రమే బీజేపీ భావిస్తోందని ఆయన అన్నారు. “దేశం ముందుకు సాగకుండా ఒక రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందదు. తెలంగాణ రాష్ట్రంతో సమానంగా దేశాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్రం విఫలమవడంతో దాదాపు రూ.3 లక్షల కోట్ల జీఎస్‌డీపీ (స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి) కోల్పోయాం’’ అని చంద్రశేఖర్ రావు అన్నారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా, దేశంలోని ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవని, దేశ రాజధానిలోనే నీరు, విద్యుత్ సంక్షోభం ఉందని ఆయన అన్నారు.
Also Read : MLC Kavitha : ఎన్ని పార్టీలు వచ్చి ఎన్ని దుష్ప్రచారాలు, ఇబ్బందులకు గురి చేసినా ప్రజలంతా కేసీఆర్ వైపే