ఎన్నికల్లో మంచి సాంప్రదాయం రావాలని, అబద్ధపు హామీ లు చెప్పేవారు ఎక్కువయ్యారన్నారు బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్. ఇవాళ ఆయన నిజామాబాద్ వేల్పూర్ లో ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ ల వైఖరేంటో ప్రజలకు తెలుసునని, రైతులు, పేద ప్రజల గురించి పట్టించుకునే పార్టీ లు రావాలన్నారు సీఎం కేసీఆర్. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమని, చర్చ జరిపి ఆలోచించి ఓటేయాలన్నారు. 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో సబ్ స్టేషన్ల కోసం మూడేళ్లు తిరగాల్సి వచ్చేదని, దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు లేదన్నారు సీఎం కేసీఆర్. నరేంద్ర మోడీ కి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని, మోటర్లకు మీటర్లు పెట్టకుండా అడ్డుకున్నానన్నారు సీఎం కేసీఆర్.
Also Read : ACA Secretary: ఏపీలో మంచి క్రికెట్ గ్రౌండ్స్, మౌలిక వసతులు ఉన్నాయి..
అంతేకాకుండా.. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతోందని, కరెంటు కొరత రానివ్వమని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మార్చి తర్వాత ఆసరా పింఛన్ 5 వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. తలసరి ఆదాయం తలసరి విద్యుత్ లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అని ఆయన అన్నారు. రైతు బంధు దుబారా అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. కర్నాటకలో రైతులు గొల్లుమంటున్నారన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ చూడమన్న కాంగ్రెస్ నేతల సవాల్‌పై స్పందించారు కేసీఆర్. వందకు వంద శాతం దళిత బంధును కొనసాగిస్తామన్నారు.
Also Read : Vivek Venkataswamy : ఎన్నికల్లో పోటీ అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది
