CM KCR : ఐటీ రంగ ఉద్యోగాల సృష్టిలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని గోల్కొండ కోట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. త్రివర్ణ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ రంగంలో తెలంగాణ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోందన్నారు. 1500 కు పైగా పెద్ద, చిన్న ఐ.టి పరిశ్రమలు నేడు హైదరాబాద్ లో కొలువై ఉన్నాయి. ఐటీ రంగ ఉద్యోగాల సృష్టిలో మన రాష్ట్రం కర్ణాటకను అధిగమించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది కాలంలో తెలంగాణ ఐటీ పరిశ్రమ 1 లక్ష 55 వేల ఉద్యోగాలు అందించి రికార్డు సృష్టించింది. ఐటీ రంగంలో మొత్తంగా 7 లక్షల 80 వేల ఉద్యోగాల కల్పన జరిగింది. జీఎస్‌డీపీలో రుణ నిష్పత్తి పరిశీలిస్తే .. దేశంలోని 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు మన రాష్ట్రం కన్నా అధికంగా అప్పులు కలిగి ఉన్నాయి. జీఎస్‌డీపీలో మన రాష్ట్ర అప్పుల నిష్పత్తి 23.5 శాతం కాగా, జిడిపిలో దేశం అప్పుల నిష్పత్తి 50.4 శాతం. ఏ రకంగా చూసినా రాష్ట్రం అప్పులు ఎఫ్.ఆర్.బి.ఎం. చట్ట పరిమితుల్లోనే ఉన్నాయి. ఈ వాస్తవాన్ని గమనించకుండా బురదజల్లడమే లక్ష్యంగా కొంతమంది రాష్ట్ర అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తున్నారు.
కేంద్ర రాష్ర్టాలు జోడు గుర్రాల మాదిరిగా ప్రగతిరథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు కోరుకున్నారు. అందుకే సమాఖ్య స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ గద్దె మీద కూర్చొన్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తున్నది. కూచున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతున్నది. కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్ధంగా 41శాతం వాటా రాష్ట్రాలకు చెల్లించాలి. కేంద్రం ఈ వాటాను కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపు రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటున్నది.
Also Read
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
తాజావార్తలు
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!