CM KCR : దేశంలో అపార సహజ సంపద ఉన్నా అది జనానికి చేరువ కావడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేడు మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. అయితే.. ఈ సందర్భంగా నాందేడ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి వనరులు లేని సింగపూర్, మలేసియా అద్భుతాలు సాధిస్తున్నాయని, భారత్ మాత్రం ఎక్కడిది అక్కడే ఉందని, దేశంలో అపార సహజ సంపద ఉన్నా అది జనానికి చేరువ కావడం లేదని ఆయన మండిపడ్డారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి వెనుక ఉన్న మతలబు ఏంటని, దేశంలో ఇప్పటి వరకు ఒకే రోజు 2,15,888 మెగావాట్లుకు మంచి వాడలేదన్నారు. 4,10లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉందన్నారు సీఎం కేసీఆర్. అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయన్నారు సీఎం కేసీఆర్. దేశ రాజధాని ఢిల్లీలో కూడా నీరు, విద్యుత్ కొరత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఎన్నో విషయాల్లో భారత్ వెనుకబడి ఉందని, సమస్యల పరిష్కారం వదిలేసి మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు.
Also Read : Paskistan Economic Crisis: ఐఎంఎఫ్ షరతులకు “ఎస్” అంటేనే పాక్‌కు సాయం.. ఆ షరతులు ఏంటంటే..?
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
వ్యాపారం మా విధానం కాదని మోదీ చెబుతున్నారని, ప్రభుత్వం ఎందుకు వ్యాపారం చేయకూడదని ప్రశ్నించారు. దేశంలో 360 టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, మన దేశంలో బొగ్గు నిల్వలతో 125 సంవత్సరాల పాటు దేశమంతా విద్యుత్ ఇవ్వొచ్చన్నారు. పవర్ సెక్టార్ చాలా ముఖ్యమైంది. విద్యుత్ రంగాన్ని ప్రయివేటుపరం చేయకూడదు. కానీ కేంద్రం అదానీ, అంబానీ,జిందాల్ పాట పాడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని అడ్డంగా అమ్మేస్తున్నారు. అదానీ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది పెను ముప్పు. ఇలాంటి కుట్రలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. విద్యుత్ రంగాన్ని ప్రయివేటుపరం చేసినా, మేం జాతీయం చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు..
Also Read : MP K.Laxman : ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుంది
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!