Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Kcr Praised Babu Jagjivan Ram

CM KCR : బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తి దాయకం

Published Date :April 4, 2023 , 7:21 pm
By Gogikar Sai Krishna
CM KCR : బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తి దాయకం
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని.. బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తి దాయకమని, దళిత సమాజాభివృద్ధికోసం వారు చేసిన సేవలు గొప్పవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొనియాడారు. బాబూ జగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుడిగా, గొప్ప రాజకీయవేత్తగా, సామాజిక సమానత్వం కోసం తన జీవితకాల పోరాటం చేసిన సంస్కరణ శీలిగా భారతదేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచివుండే గొప్ప దార్శనికుడు బాబు జగజ్జీవన్ రామ్ అని సీఎం కేసీఆర్ అన్నారు. తన సుదర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉపప్రధాని పదవితో పాటు, పలు మంత్రిత్వ శాఖలు చేపట్టి ఆయా రంగాల్లో తనదైన ముద్రను, భారతదేశ పురోభివృద్ధికి పునాదులు వేసారని సీఎం అన్నారు. దళితులు, వెనుకబడిన తరగతులు, అణచివేతకు గురైన వర్గాల ఉన్నతి కోసం, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు, కార్మికోద్యమాలను నడిపారని తెలిపారు.

Also Read : statue of Ambedkar: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాం..కేసీఆర్‌పై దళిత మేధావులు హర్షం

కార్మికశాఖ మంత్రిగా, కార్మిక సంక్షేమ విధానాలకు బాటలు వేసిన బాబూ జగజ్జీన్ రామ్… కార్మిక లోక పక్షపాతి అని సీఎం కీర్తించారు. జీవిత పర్యంతం పేదలు, పీడిత వర్గాల సంక్షేమం, హక్కుల సాధన కోసం పనిచేసిన బాబు జగజ్జీవన్ రామ్ ప్రజలు ప్రేమగా పిలుచుకునే ‘బాబూజీ’ గా ప్రఖ్యాతులయ్యారని సీఎం తెలిపారు. బాబూజీ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పేదలు, వెనుకబడిన వర్గాలు, గిరిజన, దళిత వర్గాల అభ్యున్నతి కోసం దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. దేశమే ఆశ్చర్యపోయే రీతిలో ఫలితాలు సాధిస్తున్నదని సీఎం స్పష్టం చేశారు.

పలు పథకాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తూ, సామాజికంగా ఆర్థికంగా వివక్షకు గురైన దళితుల సమగ్రాభివృద్ధికి చర్యలు చేపడుతున్నదని సీఎం తెలిపారు. దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దళిత సంక్షేమ మోడల్ గా, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం తెలిపారు. ఎన్ని అడ్డంకులెదురైనా, దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఇదే పట్టుదలతో ముందుకు సాగుతుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Babu Jagjivan Ram
  • breaking news
  • BRS
  • cm kcr
  • latest news

తాజావార్తలు

  • Harish Rao : తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చుతారా.?

  • No Rain-No Gain: వానలు పడితే స్టాక్ మార్కెట్ పరుగులు.. వర్షానికి, స్టాక్ మార్కెట్‌కు సంబంధం ఏంటి..?

  • Mumbai Cricket Association: క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ టైమ్.. MCA ప్లేయర్స్ కి వార్షిక కాంట్రాక్టులు.. ఏకంగా రూ.20 లక్షలు

  • Rohit Sharma: ‘ముంబైకి రాజా’ ఏంటి ఆ చిలిపి పనులు.. ప్లేయింగ్ XIలో ఉంటాడా?

  • Lenskart: బొట్టు-తిలకంపై నిషేధం, హిజాబ్‌కు అనుమతి.. టీసీఎస్ రచ్చ మధ్య లెన్స్‌కార్ట్ డ్రెస్‌కోడ్..

ట్రెండింగ్‌

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions