NTV Telugu Site icon

CM KCR : మోడీ.. నిన్ను నీ అహంకారమే పడగొడుతుంది

Cm Kcr Speech

Cm Kcr Speech

CM KCR Made Comments on PM Modi

తెలంగాణ రాష్ట్ర రాజకీయం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం మునుగోడు ప్రజా దీవెన పేరుతో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. మోడీ.. నిన్ను నీ అహంకారమే పడగొడుతుందని సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. అంతేకాకుండా.. ఈడీలు కాదు బోడిలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో.. ఈడీ వస్తే నాకే చాయి తాపీ పోవలె.. మోడీ నువ్వు గోకినా.. గోకక పోయినా నేను గోకుతూనే ఉంటా అంటూ కేసీఆర్‌ ధ్వజమెత్తారు. రేపు అమిత్ షా తన వైఖరి స్పష్టం చేయాలన్నారు. ఉప ఎన్నిక ఎవరి కోసం వచ్చిందని, మునుగోడు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి…మన చుట్టూ చర్చ పెట్టాలన్నారు. జాతీయ స్థాయిలో పోరాటం కోసం వివిధ పార్టీలతో మాట్లాడుతున్నామని, గోల్ మాల్ ఉప ఎన్నిక అయితుందని, ఎవరి మంచికోరి ఈ ఉప ఎన్నిక ? అని ఆయన ప్రశ్నించారు.

K.Chandrashekar Rao : దేశంలో మతపిచ్చి ఎవరికి మంచిది.. అంతా బాగుండాలి.. అందులో మనం ఉండాలి

మునుగోడులో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ప్రకటించిందని, మునుగోడు నుంచి ఢిల్లీ దాకా మన ఐక్యత కొనసాగలన్నారు. భవిష్యత్తు లో సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందని, కృష్ణా లో ఎన్ని నీళ్లు తెలంగాణకు వస్తాయో మోడీ సర్కార్ చెప్పదన్నారు. ఎందుకు మా వాటా తేల్చారు.. అని ఆయన ప్రశ్నించారు. బిడ్డా అమిత్ షా.. సమాధానం చెప్పు.. కొట్లాట తెలంగాణ కొత్త కాదు.. మొదలు పెడితే ఎంత దాకా అయిన పోతాం. రాజ్ గోపాల్ రెడ్డి, కేంద్ర మంత్రో కృష్ణ జలాల గురించి అడగరంట కానీ…అమిత్ షా ను డోల బాజ్ తో తీసుకువస్తారట. కృష్ణా జలాల వాటాపై మునుగోడు సభలో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.. ఎనిమిది ఏళ్ళు అయ్యింది …బీజేపీ సర్కార్ వచ్చి…ఒక్క మంచి మేలు జరిగిందా ఎవరికయినా..? అని సీఎం కేసీఆర్‌ విమర్శలు గుప్పించారు.