తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గులాబీ అధినేత ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గంలో ప్రచారం చేస్తూ ప్రతి పక్షాలకు కౌంటర్ ఇస్తున్నారు. ఇక, కేసీఆర్ ఇప్పటికే 70 నియోజక వర్గాల్లో ప్రచారం పూర్తి చేశారు. ఇప్పుడు రెండో విడత ప్రచారంలో ఆయన స్పీడ్ గా దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగానే నేడు నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన చేస్తున్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డి, బోధన్, నిజామాబాద్ నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. బోధన్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ బాస్ పాల్గొంటారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీ కాలేజ్ గ్రౌండ్ లో ప్రజా ఆశీర్వాద సభలో కూడా పాల్గొంటారు. ఇక, ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని సభలోనూ ఆయన పాల్గొంటారు. ఈ మేరకు ప్రత్యేక హెలికాప్టర్ లో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో గులాబీ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. అలాగే మెదక్ లోని సీఎస్ఐ చర్చి గ్రౌండ్స్ లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.