NTV Telugu Site icon

Sai Chand: సాయి చంద్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్

Kcr

Kcr

ప్రముఖ గాయకుడు , తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మరణించారు. నిన్న (బుధవారం) కుటుంబ సభ్యులతో కలిసి బిజినేపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కి వెళ్లిన సాయిచంద్ అర్ధరాత్రి సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సాయిచంద్ మరణించినట్లు నిర్ధారించారు.

Read Also: UP Driver: 28 ఏళ్ల తరువాత కోర్టు సమన్లు.. ఎందుకో తెలుసా?

సాయిచంద్ భౌతికకాయాన్ని రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు. కాసేపట్లో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాసేపట్లో గుర్రంగూడ నుంచి సాయిచంద్ అంతిమయాత్ర స్టార్ట్ కానుంది. కాగా ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ గుర్రంగూడలోని సాయింద్ నివాసానికి కాసేపట్లో వెళ్లనున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పిస్తారు.

Read Also: Tamannah : రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతున్న తమన్నా..

సాయిచంద్ మృతితో కుటుంబ సభ్యుల్లో, బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు సాయిచంద్ మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు. పలువురు గుర్రంగూడ వెళ్లి సాయిచంద్ భౌతిక కాయానికి నివాళులు ఆర్పిస్తున్నారు. సాయిచంద్ చిన్నవయస్సులోనే అకాల మరణం చెందడం ఎంతో బాధగా ఉందని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు కన్నీరు పెట్టుకున్నారు.

Read Also: BMW M 1000 RR Launch: 55 లక్షల విలువైన సరికొత్త బైక్‌.. గరిష్ట వేగం గంటకు 314 కిమీ!

సాయిచంద్ వనపర్తి జిల్లా అమరచింతలో 1984 సెప్టెంబర్ 20న జన్మించారు. పీజీ వరకు చదువుకున్న సాయిచంద్ విద్యార్థి దశ నుంచే కళాకారుడు, గాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన గళంతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించారు. 2021 డిసెంబర్ నెలలో సాయిచంద్‌ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సాయిచంద్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.