cm kcr fired on bjp governmnet
తెలంగాణలో రాజకీయం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం చుట్టు తిరుగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా.. టీఆర్‌ఎస్ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభటో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ.. విమానాలు, బ్యాంక్ లు, రోడ్లు అమ్ముతున్నారు…వరుస వట్టి మిగిలింది రైతులు, భూములు, వ్యవసాయ పంటలపై ఇప్పుడు దృష్టి పెట్టారు. మోడీ దోస్తులు సూట్ కేసులు పట్టుకుని రెడీగా ఉన్నారు…కార్పోరేట్ వ్యవసాయం కోసం. ఒక లక్ష వెయ్యి మందికి మునుగోడు లో రైతు బంధు వస్తుంది. రైతు బంధు, రైతు భీమా అని చెప్పిన …అవి వస్తున్నాయి. రైతు బీమా ఇండియా లో ఎక్కడ అయిన ఉందా ? మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు … మన బతుకు దేరువు ఉప ఎన్నిక.
మునుగోడులో ఎవరో కావాలో మీరు తేల్చాలి. మునుగోడు నియోజకవర్గ చరిత్రలో బీజేపీ డిపాజిట్ రాలేదు. బీజేపీకి ఓటు పడితే గుర్తు పెట్టుకోండి.. బాయి కాడా కరెంట్ మీటర్ వస్తది. బీజేపీకి ఓటు పడ్డదంటే.. బాయి కాడా మీటర్ పడ్డట్లే అని గుర్తుంచుకోవాలి. ప్రజలు ఏం కావాలనుకుంటున్నారనేది కేంద్రానికి తెలియాలన్నారు కేసీఆర్. మీరు ఒక్కొక్కలు ఒక కేసీఆర్ కావాలే అంటూ మునుగోడు ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి గెలిచే ప్రసక్తే లేదని, ఇక్కడ అధికారంలో లేదు.. అక్కడ కేంద్రంలో కూడా లేదంటూ ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌కు వేసే ఓటు కూడా వేస్ట్ అయిపోతుందని, వేసే బలమేదో ఒక్క దిక్కే ఇస్తే.. తెలంగాణ ఏమంటోంది? ఏం చెప్తోంది? ఏ విధానాలు బలపరుస్తోంది? అనే మెసేజ్ పోవాలన్నారు సీఎం కేసీఆర్.