Cm Jaganmohan Reddy: విద్యాశాఖపై జగన్ సమీక్ష.. నాణ్యత విషయంలో రాజీ వద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్.జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ పూర్తయిందని వెల్లడించారు అధికారులు.ట్యాబుల మెయింటైనెన్స్‌కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్ సెంటర్‌ను కంపెనీ ద్వారా ఏర్పాటు చేస్తున్నామన్నారు అధికారులు.ట్యాబుల్లో ఎలాంటి సమస్య ఉన్నా వారం రోజుల్లో మరమ్మత్తు చేసి లేదా కొత్త ట్యాబును విద్యార్థికి అందించాలని సీఎం ఆదేశించారు. ట్యాబుల వాడకం, పాఠాలను నేర్చుకుంటున్న తీరు తదితర అంశాలపై ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు అధికారులు.
డేటా అనలిటిక్స్ ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్న తీరుపై నిరంతర పరిశీలన ఉండాలని, దీనికి అనుగుణంగా హెడ్ మాస్టర్, ఎంఈఓలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. తరగతి గదుల డిజిటలైజేషన్‌లో భాగంగా ఐఎఫ్‌పి ప్యానెల్స్ ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలను వివరించారు అధికారులు.వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి ఐఎఫ్‌పి ప్యానెల్స్ ఏర్పాటు కావాలని సీఎం ఆదేశాలిచ్చారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దన్న సీఎం…ఈ డిజిటల్ స్క్రీన్లు వల్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలన్నారు.
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
వీటిని ఉపయోగించుకుని ఎలా బోధన చేయాలో టీచర్లకు చక్కటి అవగాహన, శిక్షణ కల్పించాలన్నారు సీఎం.పిల్లలు అందరివద్దా డిక్షనరీలు ఉన్నాయా? లేవా? మరోసారి పరిశీలన చేయాలన్న సీఎం.. లేని పిల్లలు అందరికీ డిక్షనరీలు ఇవ్వాలన్నారు సీఎం. వచ్చే విద్యా సంవత్సరం విద్యాకానుక కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఆదేశం.విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పిల్లలకు విద్యాకానుక అందాలన్నారు సీఎం. పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలన్నారు సీఎం జగన్.
Read Also: Iraq: స్కర్టు, టాప్ ధరించిందని టీనేజ్ అమ్మాయిపై దాడి.. చుట్టుముట్టి అరాచకం.. వీడియో వైరల్..
ఏ స్కూల్లో లేకపోయినా వెంటనే టీచర్లు ఉండేలా చూసుకోవాలన్నారు సీఎం.సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టడం వల్ల బోధనలో నాణ్యత పెరుగుతుందని, విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగు పడుతుందన్నారు సీఎం.డీఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. గోరుముద్ద నాణ్యతను నిరంతర పరిశీలన చేయాలన్నారు సీఎం.అన్ని స్కూళ్లు, అంగన్వాడీలకు సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం మాత్రమే సరఫరా చేయాలని సీఎం ఆదేశాలు. సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక లేబుల్‌తో ఈ బియ్యాన్ని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలు, అన్ని గురుకులపాఠశాలలకు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు అధికారులు.
వారానికి మూడు రోజులు పిల్లలకు గ్లాసుడు రాగిమాల్ట్ ఇవ్వాలని…ఐరన్, కాల్షియం లోపం నివారణకు ఇది ఉపయోగపడుతుందన్నారు సీఎం.నాడు – నేడు కింద బాగుచేసిన పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణపై నిరంతర పరిశీలన ఉండాలన్న సీఎం.ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్ నిధులను వినియోగించుకుని ఏ సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు సీఎం.నాడు –నేడు రెండో దశ పనులనూ సమీక్షించారు సీఎం.22 వేలకుపైగా స్కూళ్లలో పనులు నడుస్తున్నాయన్న అధికారులు.దాదాపు రూ.1500 కోట్లు విలువైన పనులు ఇప్పటికే జరుగుతున్నాయన్నారు అధికారులు. ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: Rape Case: ఐదేళ్లుగా సెక్స్ చేయలేదు.. న్యాయం చేయండి.. ప్రభుత్వంపై యువకుడు ఫైర్
- Tags
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!