సీఎం జగన్ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పర్యటన ఖరారైంది. ఈనెల 30న మదనపల్లిలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. 30న ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయంకు చేరుకొని అక్కడ నుంచి బయలుదేరి 9.30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో 11.10 గంటలకు మదనపల్లి బీటీ కళాశాలకు వైఎస్ జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి 11.30 గంటలకు టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగే బహిరంగ సభకు కు సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు. అయితే.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. సీఎం పర్యటనకు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
Also Read : RC16: రామ్ చరణ్‌తో ‘ఉప్పెన’ దర్శకుడి సినిమా
అయితే.. ఇందులో భాగంగా డీఐజీ, ఎస్పీ, ముగ్గురు ఏఎస్పీలు, డీఎస్పీలు 10 మంది, సీఐలు 45, ఎస్‌ఐలు 120, ఏఎ్‌సఐ, హెడ్‌కానిస్టేబుళ్లు 300, కానిస్టేబుళ్లు 1100, మహిళా పోలీసులు, హోంగార్డులు 350 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వెల్లడించారు. వీరితో పాటు డాగ్‌స్వ్కాడ్, బాంబ్ స్వ్కాడ్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, స్పెషల్ పార్టీ, నిఘా, రోప్ సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎక్కడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు. ఈ నేపథ్యంలో పరిమిత ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు చెప్పారు. దీనికి ప్రజలు, వాహనదారులు సహకరించాలన్నారు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు.