రేపు అనంతపురం జిల్లాలో పర్యటించినున్నారు సీఎం వైఎస్ జగన్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ్‌లో వైఎస్సార్ రైతు దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. 2022 ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు ఖరీఫ్–2022 బీమా పరిహారాన్ని అందజేయనున్నారు సీఎం జగన్. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఏ సీజన్ లో నష్టపోయిన రైతులకు అదే సీజన్ లో సాయం చేయాలని గతంలోనే సీఎం జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
Aso Read : Raw Onion Disadvantages: పచ్చి ఉల్లిపాయ ఆరోగ్యానికి హానికరం.. ఏమవుతుందో తెలుసా?
అందులో భాగంగా రైతులను ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తున్నారు. ఈ ఏడాది జూలై 8న ఉమ్మడి అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో సీఎం జగన్ ఈ సారి నిధులను విడుదల చేయనున్నారు. వైఎస్సార్ జన్మదినం నాడు ప్రభుత్వం రైతు దినోత్సవం నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా మంత్రి ఉసా శ్రీచరణ్ పర్యవేక్షించారు. సీఎం జగన్ రైతు పక్షపాతి అని, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైయస్ జగన్‌కే సొంతమని మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.
Also Read : Prabhas: ప్రభాస్ కి ఎవర్రా ఎదురొచ్చేది… డైనోసర్ అక్కడ