ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ రైతు దినోత్సవ వేడుకల్లో జగన్ పాల్గొననున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ 2022 ఖరీఫ్ లో నష్టపోయిన రైతులకు బీమా పరిహారం ఇవ్వనున్నారు.అనంతరం అక్కడ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. సభ ముగిసిన అనంతరం వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయకు ఆయన వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా మంత్రి ఉసా శ్రీచరణ్ పర్యవేక్షించారు. సీఎం జగన్ రైతు పక్షపాతి అని, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైయస్ జగన్‌కే సొంతమని మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.
Also Read : Manipur Violence: కశ్మీర్ కంటే మణిపూర్‌లో దారుణ పరిస్థితులు.. సాయం చేయడానికి సిద్ధమన్న అమెరికా రాయబారి
ఈ సందర్భంగా 2022– ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన 10.2 లక్షల మందికి రైతులకు లబ్ధి కలిగిస్తూ రూ.1,117 కోట్ల బీమా పరిహారం విడుదల చేస్తారు. తద్వారా ఒక్క అనంతపురం జిల్లాలోనే 1,36,950 మంది రైతులకు రూ.212.94 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది. అనంతరం సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత వైఎస్సార్ జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. నేటి నుంచి 10వ తేదీ వరకు ఆ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 8వ తేదీ మధ్యాహ్నం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని మహానేతకు నివాళులర్పిస్తారు.
Also Read : Venkateshwara Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే పాపాలు ప్రక్షాళన అయిపోతాయి.