తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులపాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈపర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్.. తిరుపతి గ్రామదేవత, శ్రీవారి సోదరి శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. అంతకుముందు తరుమల పర్యటనకు బయల్దేరారు సీఎం వైఎస్ జగన్. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకుని అక్కడినుంచి రేణిగుంటకు చేరుకున్నారు. సీఎం జగన్‌కు మంత్రి పెద్దిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పలువురు ఘన స్వాగతం పలికారు.

అనంతరం గంగమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్. గంగమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, సీఎం జగన్‌కు అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అమ్మవారికి సారె ను సమర్పించారు సీఎం జగన్. .తదుపరి అలిపిరిలో ఎలక్ట్రిక్ బస్సులను సీఎం జగన్ ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో శ్రీవారి భక్తులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. జెండా ఊపి బస్సులను ప్రారంభించిన సీఎం జగన్.. అనంతరం తిరుమలకు ప్రయాణం అయ్యారు.
Read Also:బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ ఆంథెమ్’లో ఏముంది?
జగన్ పర్యటనలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. తాతయ్య గుంట అమ్మవారి ఆలయ దర్శన సమయంలో మంత్రి పెద్దిరెడ్డికి కుంకుమ,చందనం బొట్టును స్వయంగా పెట్టారు మంత్రి ఆర్ కె రోజా. గత కొంతకాలంగా పెద్దిరెడ్డి- రోజా మధ్య అంతరం పెరిగింది. ఇద్దరు మంత్రులు సీఎం జగన్ పర్యటనలో ఒక్కటయ్యారని, వీరిద్దరిని అమ్మవారు ఇలా కలిపారని కామెంట్లు వినిపించాయి. అలిపిరి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు సీఎం జగన్. తిరుమల పద్మావతి అతిధి గృహానికి చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు టీటీడీచైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి. రాత్రి 7:45 గంటలకు శ్రీవారికి పట్టువస్ర్తాలను సమర్పించనున్నారు సీఎం జగన్. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.
Read Also: Ginna: జూబ్లీ హిల్స్ హీరో సంగతి తేలుస్తానన్న మంచు విష్ణు!