రాష్ట్రంలో ఇటీవల తుఫాన్ కారణంగా దెబ్బ తిన్న పంటలు, రంగు మారిన వరి ధాన్యం కొనుగోలుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ బాధిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సమీక్షకు మంత్రి జోగి రమేష్, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, సామినేని ఉదయభాను, సింహాద్రి రమేష్, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.
Read Also: Congress: డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు.. బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వారిలో కల్పించాలి.. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది.. ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది.. ఈ విషయాన్ని రైతులకు చెప్పండి అని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్‌గా ఉండాలి.. కొన్ని నిబంధనలు సడలించి అయినా రైతులకు న్యాయం చేయాలి.. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపే బాధ్యతను అధికారులు తీసుకుంటారు.. ఆర్బీకేల వారీగా ఈ కొనుగోళ్లు జరుగుతాయని సీఎం జగన్ తెలిపారు.
Read Also: Auto Drivers Union: మహిళలకు ఫ్రీ బస్.. ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల హెచ్చరిక
సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఇప్పటికే అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది అని సీఎం జగన్ చెప్పారు. సంక్రాంతిలోగా ఇన్‌పుట్ సబ్సిడీ రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలి.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియపై అధికారులను ఆయన ఆరా తీశారు. ఈ నెల 11 నుంచి 18 వరకు ఎన్యూమరేషన్.. 19 నుంచి 22 వరకు సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేలలో లిస్ట్‌లు అందుబాటులో ఉంచనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు సవరణలు, అభ్యంతరాల స్వీకరణతో పాటు 26న జిల్లా కలెక్టర్లు తుది జాబితా ప్రకటిస్తారని సీఎం జగన్ వెల్లడించారు.