CM Jagan: గృహనిర్మాణ శాఖపై కీలక సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గృహనిర్మాణ శాఖపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఇళ్లపట్టాలు కోసం చేసిన ఖర్చు కాకుండా కేవలం నిర్మాణం కోసమే గడచిన ఆర్థిక సంవత్సంలో సుమారు రూ.3,600 కోట్లు ఖర్చుచేసింది ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13,105 కోట్లు గృహ నిర్మాణం కోసం ఖర్చు చేయనుంది ప్రభుత్వం. ఈ ఏడాది 35 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు, 3.46 లక్షల మెట్రిక్‌టన్నుల స్టీల్‌ను ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించనుంది ప్రభుత్వం.
కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై వెంటనే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్దంచేయాలని అధికారులను ఆదేశించిన సీఎం. కేసులు పరిష్కారం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నచోట… ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించే కార్యక్రమం చేపట్టాలన్న ముఖ్యమంత్రి. ఇందులో జాప్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. కోర్టు వివాదాలు తీరడంతో విశాఖలో 1.43 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేయాలన్నారు.
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
విశాఖలో పట్టాలు పంపిణీ పూర్తికాగానే, వాటికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు జూన్‌నాటికి ప్రారంభం అవుతాయన్నారు అధికారులు. దాదాపు 63 లే అవుట్లలో ఇళ్ల నిర్మాణంకోసం సమాయత్తమవుతోంది ప్రభుత్వం. ఇక్కడ భూమిని చదును చేయడంతోపాటు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, లే అవుట్లలో నీళ్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. 5వేలకుపైగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్నచోట నిర్మాణ సామగ్రిని ఉంచడానికి వీలుగా గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నామని సీఎంకి తెలిపారు. 66 గోడౌన్లలో 47 గోడౌన్ల నిర్మాణం ప్రారంభమయ్యిందని అధికారులు వివరించారు.
Read Also:Ambati Rambabu: పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం
పేదల ఇళ్ల నిర్మాణంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న ప్రజాప్రతినిధులను సత్కరించాలని నిర్ణయం. వారు చురుగ్గా వ్యవహరిస్తున్నచోట నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని వెల్లడించారు. ఇలాంటి స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించాలని నిర్ణయించారు సీఎం. మండలానికి ఒక సర్పంచ్‌ని, మున్సిపాల్టీకి ఒక కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, జిల్లాకు ఒక జడ్పీటీసీ చొప్పున అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి తాగునీరు, డ్రైనేజీ, కరెంటు లాంటి కనీస మౌలిక సదుపాయాలు ఉండాలని ఆదేశాలిచ్చారు. జగనన్న కాలనీల్లో అభివృద్ధి పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటామన్నారు సీఎం.
ఎంఐజీ ప్లాట్ల పథకంపైనా సీఎం సమీక్ష జరిపారు. పట్టణాలు, నగరాలు ఉన్న 116 నియోజకవర్గాల్లో ఎంఐజీ ప్లాట్ల పథకానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఎంఐజీ ఇళ్ల పథకంకోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయాలి. ఇప్పటికే 41 నియోజకవర్గాల్లో 4127.5 ఎకరాల భూములను గుర్తించామని తెలిపారు అధికారులు. వివాదాలు, చిక్కులు లేనివిధంగా క్లియర్ టైటిల్‌తో సరసమైన ధరలకు ఈ ప్లాట్లు ఇస్తామన్న సీఎం. మౌలిక సదుపాయాలకోసం లే అవుట్లో అన్నిరకాల ప్రమాణాలను పాటిస్తామన్నారు సీఎం. ప్రతి నియోజకవర్గంలోకూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి..ఇతర లే అవుట్లకు మార్గదర్శకంగా ప్రభుత్వ ఎంఐజీ లేవుట్ ఉండాలన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో ఎనర్జీ, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఎనర్జీ సెక్రటరీ బి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!