NTV Telugu Site icon

Memantha Siddham Bus Yatra: మేమంతా సిద్ధం బస్సు యాత్ర 9వ రోజు షెడ్యూల్ ఇదే..

Jagan

Jagan

Memantha Siddham Bus Yatra: మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన ఈ యాత్ర రేపటికి 9వ రోజుకు చేరనుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 9వ రోజు(శనివారం) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం విడుదల చేశారు. యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు చింతరెడ్డి పాలెం రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు.

Read Also: YSRCP: వైసీపీకి షాక్‌.. పార్టీకి, పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ

కొవ్వూరు క్రాస్ , సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి చేరుకుని సాయంత్రం 3 గంటలకి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్ , సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు,వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బసకు చేరుకుంటారు. వైసీపీ నేతలు సీఎం జగన్‌ 9వ రోజు యాత్ర కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.