NTV Telugu Site icon

CM Jagan : పార్టీ నేతలతో నేడు సీఎం జగన్ సమీక్ష

Jagan

Jagan

ఏపీ సీఎం జగన్‌ నేడు పార్టీ నేతలతో  కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు 175 నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో క్యాంప్ ఆఫీసులో భేటీ కానున్నారు సీఎం జగన్‌. ఇటీవల అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించిన జగన్‌.. వారి ద్వారా ఎమ్మెల్యేల పనితీరు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ భేటీలో క్షేత్రస్థాయి పరిస్థితులు, వచ్చే ఎన్నికలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్‌. ఇదిలా ఉంటే నిన్న.. విజయవాడలో వైసీపీ జయహో బీసీ మహాసభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ మన సమాజానికి వెన్నెముక బీసీలని, బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ వెన్నెముక కులాలుగా అభివర్ణించారు సీఎం జగన్‌.
Also Read : Love Harassment: పెళ్లికి నిరాకరించిన మరదలు.. కత్తితో దాడిచేసిన అక్కమొగుడు

అంతేకాకుండా.. రాజ్యాధికారంలో బీసీలు భాగస్వాములని, మన ఇంట్లో ప్రతి వస్తువు బీసీలు తయారు చేసినవేనని వ్యాఖ్యనించారు సీఎం జగన్‌. బీసీలు రాజకీయ సాధికారతకు నిదర్శనమన్న సీఎం జగన్‌.. బీసీలకు చంద్రబాబు నాయుడు ద్రోహం చేశారని ఆరోపించారు. బీసీలకు టీడీపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శలు గుప్పించారు సీఎం జగన్‌. తాము బీసీలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. శాశ్వత బీసీ కమిషన్‌ను దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేశామని జగన్‌ వెల్లడించారు.

Show comments