NTV Telugu Site icon

CM Jagan: మూడు రాజధానులు ప్రకటించే ధైర్యం చేసింది జగనే..

Jagan

Jagan

విశాఖలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓల్డ్ గాజువాకలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు ప్రకటించే ధైర్యం చేసింది జగనేనని తెలిపారు. విశాఖను రాజధానిగా చేయడమే కాదు.. జూన్ 4న ప్రమాణ స్వీకారం, పాలన చేసేది ఇక్కడ నుంచేనని పేర్కొన్నారు.

Vote Casting: భాద్యత అంటే ఇదికదా.. చేతులు లేకపోయినా ఓటేసిన వ్యక్తి.. వీడియో వైరల్..

మరో ఆరు రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుందని.. ఐదేళ్ల అభివృద్ధికి, పథకాలు కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలని సీఎం జగన్ తెలిపారు. జగన్ కు ఓటేస్తే అభివృద్ధి, పథకాలు కొనసాగింపు అవుతాయని.. చంద్రబాబుకు ఓటేస్తే మోసపోవడం.. ఇది చరిత్ర చెప్పిన సత్యమని అన్నారు. చంద్రబాబును నమ్మితే కొండచిలువ నోటిలో తలపెట్టినట్టేనని తెలిపారు. తమ మ్యానిఫెస్టోకు విశ్వసనీయత తెచ్చామని.. రంగురంగుల కాగితాలకు రెక్కలు కట్టి మోసం చేయడం చూశామని సీఎం జగన్ చెప్పారు. మరోవైపు.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీలు, సీ పోర్టులు, ఉద్యోగాలు, గ్రామ ప్రాంతంలో అందిస్తున్న పరిపాలన వ్యవస్థ ఇవన్నీ అభివృద్ధి కాదా..? అని సీఎం జగన్ ప్రశ్నించారు.

Chandrababu: వచ్చే ఎన్నికలలో ప్రజలు గెలవాలి.. ధర్మం గెలవాలి

అవ్వాతాతల కష్టాలను ఎవరైనా పట్టించుకున్నారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. అవ్వాతాతల ఇంటికే మూడువేల పెన్షన్ నేరుగా ఇంటికే పంపుతున్నామని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అక్కచెల్లెల ఖాతాల్లోకి రెండున్నర లక్షల కోట్లు ఇచ్చామన్నారు. ఆర్బీకే వ్యవస్థ గతంలో ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం గతంలో ఎప్పుడైనా చూశారా అని అన్నారు. పిల్లల చదువులకు ఏ తల్లి ఇబ్బందిపడకుండా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు.. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా మార్చామని సీఎం జగన్ పేర్కొన్నారు.

EC: వివాదాస్పద బీజేపీ పోస్టును తొలగించండి.. ఎక్స్‌ని కోరిన ఎలక్షన్ కమిషన్..

గత ఎన్నికలలో చంద్రబాబును అత్యంత అవినీతిపరుడన్న మోడీ.. ఇప్పుడు పొగడటం చూస్తే రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో చూడొచ్చన్నారు సీఎం జగన్. 2024 కూటమి ఆడుతున్న డ్రామాలో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేకంగా.. ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. జగన్ హయాంలో రాష్ట్రం ముందుకు వెళుతుంటే.. కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒప్పుకోలేదు కనుకే స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగిందని తెలిపారు. గాజువాకలో టీడీపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మద్దతు లభించినట్టేనని అన్నారు. ఒకసారి ఎన్డీఏకి ఓటు వేస్తే ఆ తర్వాత జగన్ ఎంత పోరాడిన ఆగదన్నారు. గాజువాకలో అమర్నాథ్ ను గెలిపించి విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు మేం వ్యతిరేకమని బలమైన సందేశం దేశం అంతటా పంపించాలని సీఎం జగన్ కోరారు.