ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కుల గణనకు అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నిన్న మంత్రి వేణుగోపాల్ తో సీఎం జగన్ భేటీ అయ్యారు. అయితే.. తాజాగా.. ఏపీలో కుల గణన నిర్వహించనున్నట్లు, దీని కోసం మంత్రి వేణుగోపాల్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింద. అయితే.. ఇప్పటికే బీహార్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల బీసీ గణనను చేపట్టాయి. అయితే.. ఆ రాష్ట్రాల్లో మంత్రి వేణుగోపాల్ కమిటీ అధ్యయనం చేయనుంది.
Also Read : Telangana Congress: అప్పుడు మద్దతు తెలిపి ఇప్పుడు పోరాటం చేస్తామంటే ఎలా
ఇప్పటికే బీసీ కులానికి జాతీయ జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలం పెట్టాలని సీఎం జగన్ కోరారు. అయితే.. దేశంలో బీసీల జనాభా 70 కోట్లు, మొత్తం జనాభాలో ఇది 56 శాతం అని అంచనా. 90 ఏళ్ల నాటి డేటా ఆధారంగానే కొనసాగుతున్న రిజర్వేషన్లు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు నష్టపోతున్నాయి. కులాల లెక్కల తోనే బీసీల అసలు జనాభా తెలుస్తుంది. కులగణన చేపట్టాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పదేండ్లకోసారి దేశంలో జనాభాను లెక్కిస్తున్నా.. అందులో దళితులు, ఆదివాసీల సంఖ్య పైన మాత్రమే స్పష్టమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే జనాభాలో ఓబీసీ తో పాటు ఏ ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారన్న సమగ్ర సమాచారం సేకరించడం లేదు. దీంతో ఈ మేరకు ఏపీ సర్కార్ త్వరలోనే బీసీ కుల గణను శ్రీకారం చుట్టనుంది.
Also Read : CM Jagan : నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన