Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Jagan Inaugurated Global Spices Unit

CM Jagan : ఐటీసీ స్పైస్‌ ప్లాంట్‌ – వండర్‌పుల్‌ మూవ్‌మెంట్‌

Published Date :November 11, 2022 , 2:28 pm
By Gogikar Sai Krishna
CM Jagan : ఐటీసీ స్పైస్‌ ప్లాంట్‌ – వండర్‌పుల్‌ మూవ్‌మెంట్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్ధ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘అందరికీ స్వాగతం. వేలాదిమంది రైతులకు మేలు చేసే ఇంత మంచి పరిశ్రమ ఏర్పాటు చేసినందుకు ఐటీసీ బృందానికి అభినందనలు. ఐటీసీ లిమిటెడ్‌ ఛైర్మన్‌ సంజీవ్‌ పూరి, స్పైసెస్‌ బోర్డు సెక్రటరీ సతియాన్, నా కేబినెట్‌ సహచరులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, అతిధులందరికీ అభినందనలు తెలిపారు.

ఐటీసీ స్పైస్‌ ప్లాంట్‌ – వండర్‌పుల్‌ మూవ్‌మెంట్‌.
ఐటీసీ గ్లోబల్‌ స్పైస్‌ ప్లాంట్‌ ఇవాళ ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. దాదాపుగా రూ.200 కోట్ల పెట్టుబడి, ఏటా 20వేల మెట్రిక్‌ టన్నుల మిర్చితో పాటు మరో 15 రకాల సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా ప్రాసెస్‌ చేసి ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తారు. మిర్చితోపాటు అల్లం, పసుపు, ధనియాలు, యాలకులు వంటి 15 రకాల సేంద్రీయ సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్‌ చేస్తారు. ఈ ప్లాంట్‌ తొలిదశ పూర్తయింది. రెండో దశ కూడా మరో 15 నెలల్లో పూర్తవుతుందని చెబుతున్నారు. అది కూడా పూర్తయితే… దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ మన రాష్ట్రంలోనే ఉంటుందని ఐటీసీ ఛైర్మన్‌ సంజీవ్‌ పూరి చెప్పారు. ఇప్పటికే 20వేల మెట్రిక్‌ టన్నుల ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెడుతున్నారు.. దీనివల్ల దాదాపుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం జరుగుతుంది .అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న 14వేల మంది రైతులకు ఇది ఒక గొప్ప వరంగా ఉపయోగపడుతుంది. నవంబరు 2020లో ఈ ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభించారు. ఈ రోజు నవంబరు 2022 అంటే కేవలం 24 నెలల కాలంలోనే ఈ ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభించి, పనులు పూర్తి చేసారు. ఇంత వేగంగా అడుగులు పడ్డాయి అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంత ఉందన్నదానికి వేరే నిదర్శనం అవసరం లేదు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ – ఏపీ నెంబర్‌ వన్‌.
ఇక్కడ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి మాట్లాడాలి. దీని నుంచి నేను మాట్లాడ్డం కన్నా… ఐటీసీ ఛైర్మన్‌ సంజీవ్‌ పూరి గారు ఆంధ్రప్రదేశ్‌లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి గొప్పగా మాట్లాడారు. ఆయన నోట్లోంచిæ ఈ మాటలు రావడమే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి అధికారికి ఇదొక గొప్ప క్రెడిట్‌.
గత మూడు సంవత్సరాల నుంచి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్ధానం ప్రతి సంవత్సరం తీసుకుంటుంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మొట్టమొదటిసారిగా గత మూడు సంవత్సరాలుగా .. పరిశ్రమలను పెట్టే వాళ్లని కూడా అభిప్రాయాలను అడిగి, వాటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కి సంబంధించిన మార్కులు ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ గడిచిన మూడు సంవత్సరాలుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా నెంబర్‌ వన్‌ స్ధానం తీసుకోవడం అంటే… ఇదొక గొప్ప మార్పు. గొప్ప సుగుణం.

రూ.3450 కోట్లతో 26 జిల్లాల్లో పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ….
ఇటువంటి పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఇంకా ఎక్కువ రావాలని ఇప్పటికే కార్యాచరణ చేశాం. 26 జిల్లాలు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలోనూ రైతులు స్ధానికంగా పండించే పంటలన్నింటికీ కూడా ఇంకా మెరుగైన ధర రావాలి, రైతులకు ఇంకా మెరుగైన పరిస్థితులు ఉండాలి, వాల్యూ ఎడిషన్‌ ద్వారా అది సాధ్యమవుతుందని 26 పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను రూ.3450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్‌ చేసింది. దీనివల్ల ప్రతి జిల్లాలో ఉన్న రైతులకు మేలు చేయడమే కాకుండా దాదాపు 33వేల ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం. ఇందులో ఫేజ్‌ –1 కు సంబంధించి 10 యూనిట్ల కోసం రూ.1250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే కార్యక్రమాలు డిసెంబరు, జనవరిలో శంకుస్ధాపన చేయనున్నాం. ఇవన్నీ ఒక్కసారి పూర్తయితే, మరో రెండు మూడేళ్లలో ఈ 26 అందుబాటులోకి వస్తాయి. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా, రైతన్నలకు ఇది ఒక పెద్ద వరంగా మారనుంది.

రైతుల ఉత్పత్తులకు వాల్యూ ఎడిషన్‌….
ఈ స్పైస్‌ ప్లాంట్‌కు సంబంధించిన ప్రొసీజర్‌ ఎలా ఉంటుందని విచారణ చేశాను. వీళ్ల ప్రొసీజర్‌ ఎలా ఉంటుంది, ఏమేం చేస్తారో కూడా విచారణ చేశాను. మెటీరియల్‌ వచ్చిన వెంటనే క్లీనింగ్, గ్రేడింగ్, డీస్టీమింగ్, గ్రైండింగ్, బ్లెండింగ్, స్టీమ్‌ స్టెరిలైజేషన్, ప్యాకింగ్‌ ఇటువంటి రకరకాల పద్ధతిలో ఈప్రాసెసింగ్‌ పూర్తిచేసుకుంటే రైతులు పండించిన పంటకు వాల్యూ ఎడిషన్‌ జరుగుతుంది. ఎక్స్‌పోర్ట్‌ మార్కెట్‌లో వీటి అమ్మకం కూడా సులభమవుతుందనే ఉద్ధేశ్యంతో ఈ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటువంటి ప్రాసెసింగ్‌ యూనిట్లు మన రాష్ట్రంలో రావడం వల్ల మన రైతులుకు కచ్చితంగా మేలు జరుగుతుంది. ఇన్ని వందల కోట్ల రూపాయిలతో పెట్టుబడితో ఇక్కడ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెట్టారు కాబట్టి.. మన రైతుల ఉత్పత్తులకు మెరుగైన రేటు ఇచ్చి.. మన రైతులను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమంలో ఐటీసీ ముందడుగు వేస్తుంది.

ఇటువంటి గొప్ప మార్పులు వ్యవసాయరంగంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి గొప్ప మార్పుల్లో మొట్టమొదటి తొలి అడుగు మన ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాల స్ధాపనతో పడింది.
ప్రతి గ్రామంలో ఆర్బీకే స్ధాపన ద్వారా రాష్ట్రంలో దాదాపు 10,668 ఆర్బీకేల స్ధాపించాం. ప్రతి ఆర్బీకేలోనూ అగ్రికల్చర్‌ గ్యాడ్యుయేషన్‌ చదివిన ఒక అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ను నియమించి.. రైతును చేయిపట్టుకుని విత్తనం నుంచి విక్రయం వరకూ తోడుగా ఉండే గొప్ప మార్పును గ్రామాల్లో తీసుకొచ్చి, గొప్ప విప్లవం సృష్టించాం.

ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో– ప్రభుత్వం…
ఐటీసీ సంస్ధ ఈ రాష్ట్రంలో ఇంకా మెరుగైన పరిస్థితుల్లోకి పోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఐటీసీకి అన్ని రకాల మద్ధతు ఇచ్చే విషయంలో వెనుకడుగు ఎప్పుడూ ఉండదని ఐటీసీ యాజమాన్యానికి తెలియజేస్తున్నాను.
సంజీవ్‌ పూరి గారికి మరొక్క విషయం తెలియజేస్తున్నాను.
మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా… రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటుంది. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొండి. మీ కష్టాన్ని మా కష్టంగా భావించి.. సాధ్యమైనంత వేగంగా దాన్ని పరిష్కరిస్తాం. ఇది మా మాట. ఇంత మంచి ప్రాజెక్టు ఏర్పాటు చేసినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదములు తెలియజేస్తున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • cm jagan
  • Global Spices Unit
  • ITC Groups
  • latest news

తాజావార్తలు

  • Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు

  • Israel-Iran War: ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం

  • Actress Subhashini Suicide: భర్త వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి..

  • Taramati Drug Case: తారామతి రిసార్ట్ డ్రగ్స్ కేస్ లో కీలక విషయాలు.. డీజే జాసన్ కు డ్రగ్స్ పాజిటివ్

  • Trisha Vijay: త్రిష ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. విజయ్‌తో పెళ్లి వార్తలకు చెక్ పెట్టినట్టేనా?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions