TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్‌లకు గట్టి పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీవీఎస్ మోటార్స్ త్వరలో 160cc సెగ్మెంట్లోకి ప్రవేశించి, మ్యాక్సీ స్కూటర్ విభాగంలో యమహా ఏరాక్స్ 155 మరియు హీరో జూమ్ 160కి తీవ్ర పోటీ ఇవ్వనుంది. గత సంవత్సరం టీవీఎస్ ఎన్‌టార్క్ 150ని విడుదల చేసింది. ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వచ్చిన ఈ స్పోర్టీ స్కూటర్ ఎన్‌టార్క్ 125 కంటే పై స్థాయికి చెందిన మోడల్‌గా ప్రవేశపెట్టబడింది. అయితే, మార్కెట్లో వినియోగదారులు లిక్విడ్-కూల్డ్ ఇంజన్, హైవే రైడింగ్‌కు అనువైన గాలి రక్షణ (విండ్ షీల్డ్) మరియు 14 అంగుళాలు లేదా అంతకంటే పెద్ద టైర్లు ఉన్న నిజమైన మ్యాక్సీ స్కూటర్‌ను ఆశిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం, టీవీఎస్ ఈ డిమాండ్‌ను గుర్తించి 160cc ఎన్‌టార్క్ మ్యాక్సీ స్కూటర్‌పై పని చేస్తోంది.
కొత్త 160cc స్కూటర్ ఏమేమి ఉండవచ్చు?
నివేదికల ప్రకారం, రాబోయే ఈ స్కూటర్ ప్రస్తుత ఎన్‌టార్క్ 150 కంటే భారీ ఇంజన్ సామర్థ్యంతో పాటు లార్ట్ బాడీ సైజ్ కలిగి ఉంటుంది. ఇది యమహా ఏరాక్స్ 155, హీరో జూమ్ 160కి నేరుగా పోటీగా నిలుస్తుంది.
Also Read
- Ethanol Cars: ఇండియాలో ఇక పెట్రోల్ కార్లకు స్వస్తి.. E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్..
- Hyundai Bayon SUV: Hyundai Bayon లాంచ్.. ధర రూ.9.99 లక్షలు, 1.5L ఇంజిన్‌తో కొత్త SUV!
- Upcoming SUVs in India: 2026 చివరి నాటికి భారత్‌లోకి రానున్న 4 కొత్త SUVలు.. హోండా EV నుంచి మహీంద్రా వరకు!
- Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
లాంచ్ టైమ్‌లైన్
ఈ కొత్త 160cc మ్యాక్సీ స్కూటర్ వచ్చే ఏడాది (2027)లో విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు. టీవీఎస్ ఎయిర్-కూల్డ్ స్కూటర్ల కంటే మరింత ఆధునికమైన, ప్రీమియం అనుభవం కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సెగ్మెంట్లో హోండా ADV 160తో కూడా త్వరలో ప్రవేశించే అవకాశం ఉంది.
డిజైన్ & ఫీచర్లు
సెంట్రల్ స్పైన్ డిజైన్ ఉంటుందా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.
పొడవైన వీల్‌బేస్, 14-అంగుళాల టైర్లు ఆశించవచ్చు.
డ్యూయల్ హెడ్లైట్లు వేరియబుల్ కలర్ టెంపరేచర్‌తో రావచ్చు.
డాష్‌క్యామ్ ఫీచర్ ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉంది.
ప్రాక్టికాలిటీ & సేఫ్టీ
ఉత్సాహవంతులను ఆకర్షించడానికి పెద్ద బూట్ స్పేస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫుల్-ఫేస్ హెల్మెట్ సులభంగా అమరేంత లోతుగా బూట్ ఉండాలని భావిస్తున్నారు. అలాగే, వెనుక చక్రానికి డిస్క్ బ్రేక్ ఇవ్వాలని కస్టమర్లు ఆశిస్తున్నారు.
మార్కెట్ ప్రభావం
ఒకవేళ టీవీఎస్ ఈ స్కూటర్‌ను సరైన ధరలో, ఆకర్షణీయమైన ఫీచర్లతో తీసుకువస్తే, ప్రీమియం మ్యాక్సీ స్కూటర్ సెగ్మెంట్లో బలమైన పోటీ ఏర్పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాను పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
-
Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
ట్రెండింగ్
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త