సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం చిత్తూరు మెసానికల్ గ్రౌండ్స్ చేరుకున్న సీఎం జగన్ చిత్తూరు డెయిరీ –అమూల్ డెయిరీకి శంకుస్థాపన, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మూతపడ్డ చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామని, 2002లో కుట్రపూరితంగా ఈ డెయిరీని మూసివేశారు అని పాదయాత్ర సమయంలో నాకు చెప్పారన్నారు. ఒక పథకం ప్రకారం చంద్రబాబు ఈ డెయిరీని నష్టాల్లోకి నెట్టేసి మూసివేశారని జగన్ మండిపడ్డారు. తన సొంత హెరిటేజ్ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని మూత వేయించారని, సహకారం రంగంలో ఉన్న చిత్తూరు డెయిరీ నష్టాల్లోకి, హెరిటేజ్ డెయిరీ లాభాల్లోకి వెళ్ళడం ఆశ్చర్యం వేస్తుందన్నారు.
Also Read : Tamilnadu: ఏడేళ్లలో.. లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తమిళనాడు!
అంతేకాకుండా.. ‘ఇచ్చిన మాట ప్రకారం పాత బకాయిలు తీర్చి, ఈ డెయిరీ ప్రారంభిస్తున్నాము… అమూల్ సంస్థ 385 కోట్ల పెట్టుబడులు పెడుతోంది.. సహకార రంగంలో ఏర్పాటు అవుతున్న అమూల్ డెయిరీ లాభాలను ప్రతి ఆరునెలల రైతులకు పంచుతారు.. 10 నెలల కాలంలో లక్ష లీటర్లతో ఇక్కడ పాల ప్రాసెసింగ్ ప్రారంభం అవుతుంది… 10 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ స్థాయికి ఇది వెళుతుంది… దీనివల్ల ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, రెండు లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు… లక్షలాది మంది రైతులకు ఇది సంతోషం పంచుతుంది… రెండేళ్లలో అమూల్ సంస్థ లక్షలాది లీటర్లు సేకరించి కోట్లాది రూపాయలు రైతులకు చెల్లించింది…. అమూల్ వల్ల ప్రైవేట్ డైరీలు కూడా రైతులకు పాల ధరలు పెంచాయి.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు ఈ మేలు జరిగింది… చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసిన మేలు శూన్యం…. కుప్పం కు ఏమీ చేయని వ్యక్తి చంద్రబాబు.. ఇల్లు కట్టుకుంటే అడ్డుకుంటున్నారని అనవసంగా మాపై నెపం వేస్తున్నారు. ప్రభుత్వ, సహకార రంగంలో 54 సంస్థలు చంద్రబాబు మూసి వేయించాడు. చంద్రబాబు దత్త పుత్రుడును ఎప్పుడు ఎందుకు ఎలా వదులుతాడో ఎవరికీ తెలియదు… ఒకరు వెన్నుపోటు వీరుడు, మరొకడు ప్యాకేజీ సూర్యుడు… ఇద్దరూ కలిసి మోసం చేస్తున్నారు… దోచుకోవడం, పంచుకోవడం, తినడం వీరికి కావాలి..
ఇప్పుడు నేను చేస్తున్నది.. అప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేదు.. ఆ ఇద్దరూ నాన్ రెసిడెన్స్ వ్యక్తులు… ప్రతిదాన్నీ ఆడ్డుకుంటారు. చనిపోయినా ప్రజల గుండెల్లో బతకాలని మళ్లీ అధికారం కోరుకుంటున్నాను. తోడేళ్ళు ఏకం అవుతున్నాయి..తప్పుడు ప్రచారాలు నమ్మకండి.’ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.