Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Jagan Has Released Input Subsidy Funds For Farmers

CM Jagan: రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేసిన సీఎం జగన్..

Published Date :March 6, 2024 , 4:55 pm
By Chandra Shekhar Pamena
CM Jagan: రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేసిన సీఎం జగన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్‌ ఆరంభంలో గతేడాది డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్‌ తుపాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారాన్ని వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,294.58 కోట్ల పరిహారాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి జమ చేశారు.

Read Also: Kalki2898AD: ఇటలీలో ఆటాపాటా.. ఫ్యాన్స్ కు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిన మేకర్స్

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఐదేళ్లుగా రైతులకు అండగా ఉంటున్నామన్నారు. పంట నష్టపోయిన రైతులకు తోడుగా ఉంటున్నామని చెప్పుకొచ్చారు. సచివాలయ పరిధిలోనే పంటనష్టపోయిన రైతుల లిస్ట్‌ ఉంటుందన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా రైతులకు పరిహారం ఇస్తున్నాం.. రైతులకు నష్టం కలగకుండా రంగు మారినా ధాన్యం కొనుగోలు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఖరీఫ్‌–2023లో 103 మండలాలను కరువు మండలాలను ప్రకటించడమే కాకుండా.. ఆయా మండలాల పరిధిలో 14.24 లక్షల ఎకరాల్లో 33 శాతం కంటే ఎక్కువగా పంటలు కోల్పోయిన 6,59,897 మంది రైతులకు రూ. 847.22 కోట్ల పెట్టుబడి రాయితీని అందిస్తున్నాం.. మేలో కురిసిన అకాల వర్షాల వల్ల 5 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 1,892 మంది రైతులకు రూ. 5 కోట్లు కోత అనంతరం పంట నష్టపరిహారం ఇస్తున్నామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

Read Also: Congress: రాహుల్, ప్రియాంక పోటీ చేసే నియోజకవర్గాలు ఇవే!

మిచాంగ్‌ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు, గాలుల వల్ల జరిగిన పంట నష్టంతో పాటు నేల కోత, ఇసుక మేటలు కారణంగా నష్టపోయిన 4.61లక్షల మంది రైతులకు రూ. 442.36 కోట్ల పెట్టుబడి రాయితీని ఇస్తున్నట్లు సీఎం జగన్ చెప్పుకొచ్చారు. తాజాగా జమ చేసిన ఇన్‌పుట్‌ సబ్సిడీతో కలిపి ఈ ఐదేళ్లలో 34.41 లక్షల మంది రైతులకు రూ. 3,261.60 కోట్లు పెట్టుబడి రాయితీని వైసీపీ ప్రభుత్వం అందించింది. ఈ 57 నెలల్లో పెట్టుబడి రాయితీ కింద 22.82 లక్షల వ్యవసాయ, ఉద్యాన, పట్టు రైతుల ఖాతాలకు రూ. 1,967.02 కోట్లు నేరుగా సీఎం జగన్ జమ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm jagan
  • Farmers
  • input subsidy funds
  • YSRCP

తాజావార్తలు

  • 430 సీసీ కెమెరాలు, 2000 పోలీసుల గస్తీ మధ్య ఉప్పల్ వేదికగా SRH vs RR మ్యాచ్..!

  • Trisha: నటి త్రిష ఇంటికి బాంబ్ బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు

  • Sudheer- Deepika Pilli : వెకేషన్లో సుధీర్ – దీపికా.. సీక్రెట్ లవ్ బట్టబయలు?

  • Bajaj Dominar 400: బజాజ్ డొమినార్ 349cc లాంచ్.. అదే లుక్, అదే ఫీచర్లు, ధర మాత్రం భారీగా తగ్గింది!

  • Pope Leo-Trump: ట్రంప్ అంటే భయం లేదు.. యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా.. పోప్ లియో ప్రకటన

ట్రెండింగ్‌

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions