కాకినాడ జిల్లా పిఠాపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని, తొలి మంత్రి పదవి హామీ ఇచ్చారు సీఎం జగన్. మరోవైపు.. కుప్పం భరత్ ను కూడా మంత్రి చేస్తానని హామీ ఇచ్చారు. దత్త పుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉంటాడా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. చిన్న జలుబు చేస్తే దత్తపుత్రుడు పిఠాపురం నుంచి హైదరాబాద్ పారిపోయాడని విమర్శించారు. మహిళలు దత్త పుత్రుడును నమ్మే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. ఐదేళ్లకి ఒకసారి కార్లు మార్చినట్లు భార్యలు మారుస్తాడు.. ఈయన ఎమ్మెల్యే అయితే మహిళలు కలిసే పరిస్థితి ఉంటుందా? అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం అని ఎద్దేవా చేశారు సీఎం జగన్.
Maharashtra: మహారాష్ట్రలో దారుణం.. మహిళను చంపిన రెస్టారెంట్ యజమాని
మరోవైపు.. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడని సీఎం జగన్ ఆరోపించారు. కురుక్షేత్ర సంగ్రామానికి 36 గంటలు మాత్రమే సమయం ఉందని.. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నిక కోసం మాత్రమే ఈ ఎన్నికలు కాదన్నారు. జగన్ కి ఓటు వేస్తే పథకాలు కొనసాగింపు ఉంటాయని.. కూటమికి ఓటు వేస్తే పధకాలు ముగింపు అవుతాయని తెలిపారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
Ramakrishna Nandamuri: రండి కదలి రండి, సమయం ఆసన్నమైంది.. వీడియో రిలీజ్ చేసిన ఎన్టీఆర్ కుమారుడు
ఇదిలా ఉంటే.. ఢిల్లీ నుంచి వచ్చిన రికమేండేషన్ తో 57 నెలలు కే మీ బిడ్డ గొంతు నొక్కేశారని సీఎం జగన్ తెలిపారు. 60 నెలలు మీ బిడ్డకి అధికారము ఇచ్చారు.. మీ కోసం నొక్కిన బటన్ పథకాలు కూడా ఆపేశారని ఆరోపించారు. నా గొంతు కాదు… మీ గొంతు నొక్కుతున్నారని ప్రజలనుద్దేశించి అన్నారు. 14 ఏళ్లుగా సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం గుర్తుందా? అని ప్రశ్నించారు. 2014 లో ఇచ్చిన ఒక్క హామీ అయిన చంద్రబాబు నేరవేర్చడా?.. ఇలాంటి హామీలు నమ్ముతారా? ఆలోచన చేయండని ప్రజలను కోరారు. కుట్రలు చూస్తుంటే వీళ్లు మనుషులేనా అనిపిస్తుంది అని అన్నారు. తుప్పు పట్టిన సైకిల్ కి రిపేర్ చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.