CM JaganMohan Reddy: ఈ స్టాంపింగ్ విధానంతో ప్రయోజనాలెన్నో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈఏడాది ఏపీలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరిగింది. గత ఐదేళ్లుగా క్రమంగా పెరుగుతూ వస్తుంది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం..రిజిస్ట్రేషన్ శాఖలో ఇ–స్టాంపింగ్ సేవలను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రిజిస్ట్రేషన్ సేవలు ఇక సులభతరం – ఇ –స్టాంపింగ్ సేవలు ప్రారంభం అయ్యాయి. ప్రజలే నేరుగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించే ఇ–స్టాంపింగ్ విధానం ప్రజలే స్వయంగా దస్తావేజులు తయారు చేసుకుని సులభతరంగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ఆవిష్కరణ అయింది. ఈ విధానం సురక్షితమైనది, భద్రతగలది మరియు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేనిది. www.shcilestamp.com వెబ్సైట్లో మరియు ఇ–స్టాంపింగ్ మొబైల్ యాప్ ద్వారా ఇ–స్టాంపులు ఆన్లైన్లో దృవీకరించుకోవచ్చు
నగదు,చెక్కు,ఆన్లైన్ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, పీఓఎస్,యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఎస్బీఐ,ఆప్కాబ్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్‌లు, సీఎస్సీ కేంద్రాలు, స్టాంప్ అమ్మకందార్లు, స్టాక్‌హోల్డింగ్ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 కు పైగా కేంద్రాల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. మరొక 1000కి పైగా కేంద్రాల వద్ద త్వరలో ఈసేవలు అందుబాటులోకి రానున్నాయని సీఎం చెప్పారు. ఇప్పుడు ఏపీలో క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400 కు పైగా ఎంపిక చేసిన కేంద్రాల వద్ద ఇ–స్టాంపింగ్ ద్వారా స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను చెల్లించవచ్చు.
Also Read
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
Read Also: CM JaganMohan Reddy: ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో సీఎం వైఎస్.జగన్ సమీక్ష
స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ సెంట్రల్ రికార్డు నిర్వహించే ఏజెన్సీ అయిన స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏపీ ప్రభుత్వం అందిస్తున్న మరొక ప్రజాహితమైన కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐటీ సలహాదారు శేషిరెడ్డి, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ కమిషనర్, ఐజీ రామకృష్ణ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ డీఐజీ (గుంటూరు) జి.శ్రీనివాసరావు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు.
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!