CM JaganMohan Reddy: ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో సీఎం వైఎస్.జగన్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి క్యాంపు కార్యాలయంలో ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో సీఎం వైయస్‌జగన్ సమీక్ష చేపట్టారు. సంబంధిత శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలన్నారు సీఎం. మానవ ప్రమేయాన్ని తగ్గించి… అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. లో ఆదాయాన్ని ఆర్జించే శాఖలపై సమగ్ర సమీక్ష చేశారు సీఎం జగన్. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంతమేర లక్ష్యాలను చేరుకున్నామో సీఎంకు వివరించారు వివిధ శాఖలకు చెందిన అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు అధికారులు. గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైన పనితీరు కనబరిచింది.
కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో ఏపీ ఉందన్నారు. గత ఏడాదితో పోలిస్తే కర్ణాటకలో 27.51శాతం, మహారాష్ట్రలో 24.4 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 25.29శాతం వృద్ధి సాధించింది. 2022-23లో రాష్ట్రంలో వాణిజ్యపన్నుల ఆదాయం రూ. 51,481 కోట్లు. 93.24శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టుగా వెల్లడించారు అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) రూ.60,191 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు అధికారులు. లీకేజీలను అరికట్టి, సమగ్ర పర్యవేక్షణలద్వారా లక్ష్యాన్ని చేరుకునే మార్గాలపై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు అధికారులు. సీఎం ఆదేశాల మేరకు డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, శాఖలతో సమన్వయం, ఎగవేతలపట్ల అప్రమత్తత, సమర్థతను పెంచుకునే పద్ధతుల ద్వారా పనితీరును మెరుగుపరుచుకుంటున్నామన్నారు అధికారులు. యంత్రాంగంలో సరైన విధానాలను అమలు చేయడంద్వారా సమర్థత గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయని, తద్వారా ఆదాయాలు పెరుగుతాయన్న సీఎం. వీటిపై దృష్టిపెట్టాలన్నారు సీఎం.
Also Read
స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం వృద్ది చెందినట్టుగా తెలిపిన అధికారులు. గత ఐదేళ్లుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం ఉంటుందన్నారు. 2018-19లో ఈ శాఖ ఆదాయం రూ.4725 కోట్లు కాగా, 2022-23 నాటికి రూ. 8071కోట్లకు చేరిన ఆదాయం. రిజిస్ట్రేషన్లు, టౌన్ ప్లానింగ్ విభాగాలు, మండల కార్యాలయాలు, గ్రామవార్డు సచివాలయాలు సహా ఇతర చోట్లకూడా ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. సేవలు అందించడంలో అత్యంత పారదర్శకత ఉండాలన్న సీఎం. ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపై ఏసీబీ నంబర్లను ఆయా కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలా హోర్డింగ్స్ఉంచాలన్న సీఎం. మానవ ప్రమేయాన్ని తగ్గించి పారదర్శకతను పెంచే సాంకేతిక విధానాలపై అధ్యయనం చేసి వాటిని అమల్లోకి తీసుకురావడంపై దృష్టిపెట్టాలన్న సీఎం. వచ్చే సమీక్షా సమావేశం నాటికి మంచి మార్పులు కనిపించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
అవినీతి నిరోధకశాఖను క్రియాశీలకంగా ఉంచాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.
Read Also: Seediri Appala Raju: మా రాష్ట్రం గురించి పక్క రాష్ట్రం వాళ్ళకి ఎందుకు?
2018-19 తో పోలిస్తే 2022-23లో 12.61శాతం లిక్కర్ వినియోగం తగ్గినట్టుగా తెలిపారు అధికారులు. 2018-19లో 384.3 లక్షల కేసుల లిక్కర్ ను రాష్ట్రంలో వినియోగిస్తే.. 2022-2౩లో 335.9 లక్షల కేసుల లిక్కర్ వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. 2018-19లో 277.1 లక్షల కేసుల బీరును వినియోగిస్తే.., 2022-23లో 116.7 లక్షల కేసులు బీరు మాత్రమే వినియోగించినట్టు తెలిపారు అధికారులు. 2018-19తో పోలిస్తే 2022-23లో 57.87శాతం తక్కువగా బీరు వినియోగించినట్టు వెల్లడించిన అధికారులు. డ్రగ్స్, మత్తుపదార్థాలను నివారించడానికి, వాటి పంపిణీని అడ్డుకోవడానికి అధికారులు గట్టి దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. యూనివర్శిటీలు, కాలేజీలు, విద్యాసంస్థల వద్ద కచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్ ఉండేలా హోర్డింగ్స్ఉంచాలన్నారు సీఎం. డ్రగ్స్ నివారణ కార్యక్రమాలు, టోల్ ఫ్రీ నంబర్ పనితీరుపై ప్రతి జిల్లాలో ప్రతి 15 రోజులకోసారి మాక్ డ్రిల్ చేపట్టాలని సీఎం సూచించారు.
గనులు ఖనిజాల శాఖలో 2022-23 సంవత్సరంలో రూ.4500 కోట్లు లక్ష్యం కాగా, రూ. 4,756 కోట్ల ఆదాయం. గత ఏడాదితో పోలిస్తే 26శాతం వృద్ధి. ఈ ఏడాది రూ.6వేలకోట్ల మేర ఆదాయ లక్ష్యాన్ని పెట్టుకున్నామన్న అధికారులు. రవాణాశాఖలో 2022-23లో ఆదాయం రూ. 4294.12 కోట్లు. 95.42శాతం లక్ష్యాన్ని చేరుకున్న రవాణా శాఖ. 2018-19లో ఈ ఆదాయం రూ. 3224.98 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) లో రూ.6999.42 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు. రవాణాశాఖలో మెరుగైన విధానాలు తీసుకురావాలన్నారు సీఎం.
Read Also: Extramarital Affair: ఆమె పాలిట శాపంగా మారిన వివాహేతర సంబంధం.. అసలేమైందంటే?
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!