CM Jagan : రేపు ఢిల్లీకి సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు సాయంత్రం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 6గంటల 45 నిమిషాలకు ఢిల్లీ చేరుకుని 1 జన్‌పథ్ నివాసంలో రాత్రి బస చేయనున్నారు సీఎం జగన్. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 8.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అయితే.. రేప ఉదయం పల్నాడు జిల్లా వినుకొండ వేదికగా జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు సీఎం జగన్. ఈ మేరకు సీఎం జగన్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు ముఖ్యమంత్రి సభకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. జనవరి 30వ తేదీన ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 10.40 గంటలకు వినుకొండ చేరుకుంటారు.
Also Read : Beating Retreat Ceremony : ఘనంగా రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు.. హాజరైన రాష్ట్రపతి, ప్రధాని
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ఉదయం 11.05 నుంచి 12.20 వరకు వినుకొండ వెల్లటూరు రోడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం జగన్. వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి సాయం చేసే దిశగా ప్రభుత్వం జగనన్న చేదోడు పథకం ప్రవేశపెట్టింది వైసీపీ ప్రభుత్వం. రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలు తదితరులకు ఆర్థిక సాయం అందించేందుకు రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఆయా వృత్తులు చేసుకునే వారికి ఏడాది కింద రూ.10 వేల చొప్పున సాయాన్ని అందిస్తోంది. తెలుపు రంగు రేషన్ కార్డు కలిగి 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు ఈ పథకానికి అర్హులు.
Also Read : Boat capsize : విహారంలో విషాదం.. బోటు బోల్తాపడి పదిమంది చిన్నారుల మృతి
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!