Site icon NTV Telugu

Vijaysai Reddy: సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు అధిక ప్రాధాన్యత

Vijayasai

Vijayasai

నెల్లూరులో క్రీడాకారులకు క్రికెట్ కిట్లను వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావుతో పాటు జెడ్పీ చైర్మన్ అరుణమ్మ, మేయర్ స్రవంతి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు అని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆడుదాం.. ఆంధ్ర.. కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు.. క్రీడల వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. క్రికెట్ ఆడే దేశాల్లో అతి పెద్దదైన మన దేశం నుంచి.. ఎందరో సామాన్య క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదిగారు అంటూ విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Read Also: Dr K Laxman: రేవంత్ రెడ్డి పై మరోసారి స్పందించిన బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్

మన దేశంలో క్రికెట్ కు ఆదరణ అధికంగా ఉంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అన్ని ఫార్మాట్లో మన దేశం రాణించడం అందరికీ గర్వకారణం అని తెలిపారు. క్రికెట్ క్రీడాకారుల్లో పలువురు.. రాజకీయాల్లోకి కూడా ప్రవేశించి రాణిస్తున్నారు.. విశాఖపట్నంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 800 జట్లతో క్రికెట్ పోటీలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. నెల్లూరులో కూడా ఏటా ఇలాంటి పోటీలు నిర్వహిస్తాం.. ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగు లోకి తీసుకురావడమే ఈ టోర్నమెంట్ లక్ష్యం.. నెల్లూరు రూరల్ లోని మొగ్గళ్ళ పాలెంలో 150 ఎకరాల్లో క్రీడా వసతులను కల్పిస్తాం.. ఇందు కోసం రూ.200 కోట్లను వెచ్చిస్తామన్నారు. ఈ అంశాన్ని అంశాన్ని వైసీపీ మ్యానిఫెస్టోలో కూడా చేరుస్తామని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version