NTV Telugu Site icon

Chandrababu: గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల పై సీఎం ట్వీట్..

Chandrababu Review

Chandrababu Review

గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘పాస్ పుస్తకాలపై తన బొమ్మవేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పుల్ని సరిదిద్దుతున్నామన్నారు. తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మ ఉండకూడదనేది ప్రజాభిప్రాయం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తామని తెలిపారు. నాటి అహంకార, పెత్తందారీ పోకడలు ప్రజాప్రభుత్వంలో ఉండవు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి వారి ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంటుంది.’ ముఖ్యమంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు.

Read Also: Mamata Banerjee: బెంగాల్ విభజన, కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం..

కాగా.. ఈరోజు సీఎం చంద్రబాబు రెవెన్యూపై సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల పాసు పుస్తకాలపై తన బొమ్మల కోసం రూ.15 కోట్లు తగలేశారంటూ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు, ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏమి చేయాలి అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ రాళ్లపై బొమ్మలు చెరపడానికి మరో రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని తాత్కాలిక అంచనా వేసింది. జగన్ మోహన్ రెడ్డి బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా రూ.700 కోట్ల వరకు ప్రజా సొమ్ము వృధా అయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు.. వాటితో ఏం చెయ్యవచ్చో చూడమని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం ఇచ్చారు.

Read Also: Agnipath: అగ్నిపథ్‌పై లోక్‌సభలో రగడ.. రాహుల్‌-రాజ్‌నాథ్‌ మధ్య మాటల యుద్ధం