CM Chandrababu: నాది దేవుడి దగ్గర ఒకటే సంకల్పం.. అమరావతి దేవతల రాజధాని అవ్వాలి!
- పూజలు చెయ్యను కానీ ఒక నిమిషం సంకల్పం తీసుకుంటా
- హిందువులకు పవిత్రమైన దేవుడు వెంకటేశ్వర స్వామి
- అమరావతి దేవతల రాజధాని అవ్వాలని కోరుకున్నా
- షడ్రుచుల మాదిరిగానే మన జీవితాల్లో కష్టసుఖాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాను ఎక్కువ పూజలు చెయ్యను అని, కానీ ఒక నిమిషం సంకల్పం తీసుకుంటా అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అని, హిందువులకు పవిత్రమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అని పేర్కొన్నారు. తనది దేవుడి దగ్గర ఒకటే సంకల్పం అని, అమరావతి దేవతల రాజధాని అవ్వాలని కోరుకున్నా సీఎం చెప్పుకోచ్చారు. ఉగాది షడ్రుచుల మాదిరిగానే మన జీవితాల్లో కష్టసుఖాలు ఉంటాయన్నారు. ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పుకొచ్చారు. పండుగలు మనకు ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పిస్తాయని చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేసిన అనంతరం సీఎం మాట్లాడారు.
‘తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. చాలా స్పష్టంగా, అందరికి అర్థమయ్యే విధంగా మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. తెలుగు వారికీ నూతన సంవత్సరం మొదలైంది. ఉగాది షడ్రుచుల మాదిరిగానే మన జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. పంచాంగ శ్రవణం కూడా అందరు చాలా శ్రద్దగా వింటారు. తెలుగు వారి పండగని గౌరవించేలా ఉగాదిని అందరం కలిసి జరుపుకుంటాము. ఈ సంవత్సరంలో 38 మందికి కళారత్న, ఉగాది పురస్కారాలు అందిస్తున్నాము. మనం భూమిని పూజిస్తాము. తల్లి తరువాత మనం జన్మభూమిని పూజిస్తాము.. అలాగే నీటిని పూజిస్తాము. మూడోసారి ముచ్చటగా గోదావరి, కృష్ణా పుష్కరాలు మన ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతుంది. నీటిపై మనం శ్రద్ద పెట్టాము. అందుకే నీటి భద్రతని తీసుకొచ్చాము. అన్ని జలాశయాలు కళకళ లాడుతున్నాయి’ అని సీఎం చెప్పారు.
Also Read
- Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
- Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ "పన్నీర్ టిక్కా"ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- Hyderabad: హైదరాబాద్‌లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
Also Read: AB de Villiers-RCB: ఆర్సీబీ దుమ్ము రేపడం ఖాయం.. వరుసగా రెండు, మూడు కప్పులు కొడుతుంది!
‘మన ఆచారల్లో నేచురోపతి ఉంది. సూర్య నమస్కారాలు మన ఆచారం. ఆనందంగా ఉంటే సంపద ఉంటుంది. రాబోయే రోజుల్లో పేపర్లో పాలన ఉండదు.. నేను ఎక్కడుంటే అక్కడే ఆఫీస్. ఎక్కడ ఎండ.. ఎక్కడ వడ గాలి చెప్పేయచ్చు. ఎక్కడ వడగండ్ల వాన.. ఎక్కడ పిడుగులు అనేవి ముందే తెలుస్తుంది. రాబోయే రోజుల్లో టెక్నాలజీ.. ఇదే పరిస్థితిలో ఉంటుంది. ఐటీ ప్రాముఖ్యత 30 ఏళ్ల క్రితమే ఆలోచించా. ఐటీ మన జీవితాల్లో మార్పు తెస్తుంది అని ఎప్పుడో చెప్పా. ఇవాళ గర్వాంగా చెప్పగలుగుతున్నా. ఐటీ చదువుకున్న తెలుగు వారు ప్రపంచం మొత్తంలో ఉన్నారు. డబ్బుతో పాటు విలువలు ఉండాలి. విలువలు లేని రోజు జీవితాలు పతనం అవుతాయి. మన కంటే.. విదేశాల్లో ఉన్న తెలుగు వారు పండగ బాగా చేసుకుంటున్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచం మొత్తంలో పాటిస్తూన్నారు. ఇవాళ తెలుగు జాతి నెంబర్ వన్‌లో ఉండాలి. తెలుగు ప్రజలు ఒక సంకల్పం చేస్కుందాము. 2047కి తెలుగుజాతి నెంబర్ వన్ గా ఉండాలి. ఇదే మన సంకల్పం. అప్పుడు ఐటీ.. ఇప్పుడు ఏఐ. యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. సంజీవని ప్రాజెక్ట్ లో సెల్ ఫోన్లోనే ఆరోగ్యం.. కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. ఎప్పటికప్పుడు డేటా ఆన్లైజ్ జరుగుతుంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
తాజావార్తలు
-
RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
-
Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్‌గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!