CM Chandrababu Naidu: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
- ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు.. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ఆలయ అధికారులు
- టీడీపీ నేతలు.. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Naidu: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రత్యేక విమానంలో తిరుమల బయలుదేరి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అనంతరం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేయకున్నారు. గన్నవరం నుండి కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఇంద్రకీలాదిపై ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారితో పాటు టీడీపీ నేతలు కూడా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనాననంతరం చంద్రబాబు దంపతులకు పట్టువస్త్రాలు, అమ్మవారి ప్రసాదం అందించి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఉండవల్లి నివాసానికి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం సచివాలయంలో ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు.
Read Also: Chandrababu: విద్యా కానుక కిట్లను త్వరగా పంపిణీ చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
Also Read
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు చాంబర్లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. నేడు సచివాలయం మొదటి బ్లాక్ చాంబర్లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయనున్నారు. పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. స్కిల్ సెన్సస్ ప్రక్రియ, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చంద్రబాబు సంతకాలు చేయనున్నారు. వీటికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేశారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో సచివాలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రభుత్వం అలంకరించింది.
తాజావార్తలు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!