CM Chandrababu: ఆర్ అండ్ బీ శాఖపై సీఎం సమీక్ష.. వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశాలు
- ఆర్ అండ్ బీ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష..
- పూర్తి నాణ్యతతో రోడ్ల మరమ్మతులు జరగాలని సూచన..
- నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. రూ.861 కోట్లతో చేపట్టిన పాత్ హోల్ ఫ్రీ రోడ్ల నిర్మాణం సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు.. 1307 కిలోమీటర్ల పొడవైన 18 స్టేట్ హైవేలను పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు.. నరేగా నిధులతో గ్రామాల్లో 13 వేల కిలోమీటర్ల అంతర్గత రోడ్లు నిర్మాణం చేపట్టాలని.. పూర్తి నాణ్యతతో రోడ్ల మరమ్మతులు జరగాలని సీఎం సూచించారు.. అయితే, నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.. ప్రైవేటు సంస్థల ద్వారా రోడ్ల నాణ్యతపై నివేదికలు తెప్పించాలని కీలక సూచనలు చేశారు..
Read Also: Israel-Hezbollah War: చల్లబడనున్న పశ్చిమాసియా.. యుద్ధంపై ఇరుపక్షాలు సంధి!
Also Read
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
రాష్ట్రంలో మొత్తం 45,378 కిలోమీటర్ల ఆర్ అండ్ బీ రోడ్ నెట్ వర్క్ లో 22,299 వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, ఇప్పటి వరకు 1,991 కి.మీ మేర రోడ్లపై గుంతలు పూడ్చినట్లు సీఎంకు వివరించారు అధికారులు.. మరోవైపు 1,447 కి.మీ మేర రోడ్లు రిపేర్ చేయలేని స్థితిలో ఉన్నాయని.. వీటి స్థానంలో పూర్తిగా కొత్త రోడ్లు నిర్మించడానికి 581 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.. 23,521 కి.మీ లో జంగిల్ క్లియరెన్స్ కి 33 కోట్లు ఖర్చు అవుతుంది.. రాష్ట్రంలో మొత్తం 12,653 రాష్ట్ర హైవేలలో 10,200 కి.మీ మేర పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపట్టవచ్చు.. ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా పీపీపీ పద్ధతిలో రోడ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్దం చేయాలని తెలిపారు.. మొదటి ఫేజ్ కింద 18 రోడ్లును 1,307 కి.మీ మేర పిపిపి పద్దతిలో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు.. అయితే, డీపీఆర్ లు తయారు చేసి సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలన్న ఈ సందర్భంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!