Site icon NTV Telugu

CM Chandrababu: అందుకే కడప గడ్డపై ‘మహానాడు’ నిర్వహిస్తున్నాం!

Cm Chandrababu

Cm Chandrababu

ప్రాణ సమాణమైన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం అంటూ కడప మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని ఆరంభించారు. కడప గడ్డపై తొలిసారి మహానాడు నిర్వహిస్తున్నామని, దేవుని కడపలో జరిగే మహానాడు చరిత్ర సృష్టించబోతోందన్నారు. కడపలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు తెలపడం కోసమే ఈ మహానాడు నిర్వహిస్తున్నాం అని సీఎం తెలిపారు. ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు ఏడు స్థానాలు గెలిచి సత్తా చాటాం అని, ఈసారి ఇంకాస్త కష్టపడితే పదికి పది స్వీప్ చేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు జరిగే పసుపు పండుగ మహానాడు ఈరోజు ఉదయం కడపలో ఆరంభమైంది.

మహానాడులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిలో ఉండేది. తిరుమల తొలిగడప కడపలో ఈరోజు మహానాడు చేసుకుంటున్నాం. దేవుని గడపలో జరిగే ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతోంది. ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు ఏడు స్థానాలు గెలిచి సత్తా చాటాం. ఈసారి ఇంకాస్త కష్టపడితే పదికి పది స్వీప్ చేస్తాం. కడపలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు తెలపడం కోసమే ఈ మహానాడు నిర్వహిస్తున్నాం’ అని తెలిపారు.

Also Read: Daggubati Purandeswari: అందుకే పాకిస్తాన్‌కు భారత్ తిరిగి సమాధానం చెప్పాల్సి వచ్చింది!

‘సార్వత్రిక ఎన్నికల్లో 57 శాతం ఓట్ షేరింగ్ సాధించాం. ఎన్డీఏతో సంబంధం పెట్టుకోవడం వల్ల కూడా మనకు కలిసి వచ్చింది. పార్టీ పని అయిపోయిందని అనుకునే వాళ్లకు.. వాళ్ల పని అయిపోయింది. పాలన అంటే హత్య రాజకీయాలు, వేధింపులు, తప్పుడు కేసులు కాదు. విధ్వంసం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రశ్నించిన కార్యకర్తలని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. పీక కోస్తునా చంద్రయ్య జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలాడు. ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా కార్యకర్తల్లో అదే జోరు. ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే విజయం సాధ్యమైంది’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Exit mobile version