CM Chandrababu: ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు.. నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు!
- ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో సరిగ్గా ఏడాది
- సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో పోస్టు
- నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు
- ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు అని, అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజన్నారు. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజని అన్నారు. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు అని సీఎం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో సరిగ్గా ఏడాది గడించింది. ఈ సందర్భంగా సీఎం ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
‘జూన్ 4.. ప్రజా తీర్పు దినం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు. సైకో పాలనకు అంతం పలికి.. ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు. ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు’ అని ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు.
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
Also Read: Virat Kohli: ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండాలనుకోను.. ఇక ఎక్కువ రోజులు ఆడలేను!
‘ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్నాం. ప్రజల ఆశలు, ఆకాంక్షల నెరవేర్చేందుకు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనను గాడిన పెట్టి.. సంక్షేమాన్ని అందిస్తూ, అభివృద్ధి పట్టాలెక్కించాం. రాష్ట్ర దశ దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పుకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మాట ఇస్తున్నాము. విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు, ధన్యవాదాలు. జై ఆంధ్రప్రదేశ్.. జై జై ఆంధ్రప్రదేశ్’ అని సీఎం రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?