Site icon NTV Telugu

CM Chandrababu Naidu: మంత్రులకు శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు.. ఎవరికి ఏ శాఖ అంటే..?

Ministers

Ministers

CM Chandrababu Naidu: తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు.. కేబినెట్‌ మంత్రులను కూడా ప్రమాణస్వీకారం చేయించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు కూడా కేబినెట్‌లో చోటు దక్కింది.. ఇక. మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు కొనసాగిస్తున్నారు సీఎం చంద్రబాబు.. 24 మందిలో ఆరుగురికి మాత్రమే గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.. అయితే, సాయంత్రానికి శాఖల కేటాయింపు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. హోం, ఇరిగేషన్, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, ఆర్థిక శాఖ, పరిశ్రమల శాఖలను సీనియర్లకు కేటాయించే ఛాన్స్ ఉందంటున్నారు..

Read Also: Apple CEO: యాపిల్ సీఈఓతో 13 ఏళ్ల భారతీయ బాలుడు.. ఫొటో వైరల్

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖల కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది.. గతంలో ఐటీ శాఖ చూసిన నారా లోకేష్.. తిరిగి అదే శాఖతో పాటు విద్యా శాఖ ఇస్తారని చర్చ నడుస్తోంది.. ఆర్థిక శాఖను ఆనం రామనారాయణరెడ్డి లేదా పయ్యావుల కేశవ్‌కు కేటాయిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.. ఇక, పట్టణాభివృద్ధి శాఖ ను సీఎం వద్ద లేదా నారాయణకు కేటాయిస్తారని చర్చ కూడా ఉంది.. గతంలో పట్టణాభివృద్ధి శాఖలో భాగంగా అమరావతి నిర్మాణ బాధ్యతలు చూశారు నారాయణ. మైనారిటీల సంక్షేమం శాఖను ఫరూక్ కు కేటాయించే అవకాశం ఉండగా.. గిరిజన సంక్షేమ శాఖను గుమ్మడి సంధ్యా రాణికి ఇచ్చే ఛాన్స్ ఉంది.. సాంఘిక సంక్షేమ శాఖను డోలా బాలవీరాంజనేయ స్వామి లేదా అనితకు ఇస్తారని ప్రచారం సాగుతోంది.. గతంలో బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలు చూశారు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర.. ఇలా మంత్రులకు శాఖలపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. కానీ, ఫైనల్‌ ఎవరికి ఏ శాఖలు దక్కుతాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version