శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. వాచ్ మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బాధిత కుటుంబం ఉపాధి కోసం బళ్లారి నుంచి వచ్చింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
READ MORE: Boeing: ఉద్యోగులకు బోయింగ్ షాక్.. 17 వేల మందిపై వేటు
అసలేం జరిగిందంటే…
దసరా పండుగ పూట శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో అత్తా కోడళ్లపై అత్యాచారానికి తెగబడ్డారు గుర్తుతెలియని వ్యక్తులు.. నిర్మాణంలో ఉన్న ఓ పేపర్ మిల్లులో వాచ్‌మన్‌గా ఉంటుంది ఓ కుటుంబం.. అయితే, రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు.. కొడవలితో బెదిరించి ఘాతుకానికి పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు..
READ MORE: Delhi: ఢిల్లీలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సరికొత్త వ్యూహం.. ఆ రూట్లలో వెళ్తే బాదుడే!
చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో వాచ్‌మన్‌గా చేరింది ఓ కుటుంబం.. ఐదు నెలల క్రితం ఇక్కడికి ఉపాధి కోసం వచ్చిన బళ్లారికి చెందిన ఆ కుటుంబం.. ఇక్కడే ఉంటున్నారు.. అయితే, శుక్రవారం రాత్రి సమయంలో రెండు బైక్‌లపై దుండగులు వచ్చినట్టుగా తెలుస్తోంది.. కొడవలితో బెదిరించి.. బలవంతంగా పక్కకు లాక్కెల్లి.. ఒకరి తర్వాత ఒకరిపై అత్తా కోడళ్లపై అత్యాచారానికి ఒడిగట్టారట దుండగులు.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.. ఇక, జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఎస్పీ రత్న.. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు..? తెలిసినవారి పనేనా..? ఇలా అనేక కోరణాలు దర్యాప్తు చేపట్టారు..