తాను చాలాసార్లు సీఎం అయ్యానని, ఎప్పుడూ ఇంతలా అభివృద్ధి చేయలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నగరి టీడీపీకి కంచుకోట అని, వచ్చే ఎన్నిక నాటికి నగరికి కృష్ణ జలాలు అందిస్తాం అని హామీ ఇచ్చారు. కోసల నగరాన్ని పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తాం అని, నగరి యువతకు ఉపాది ఇక్కడే కల్పిస్తాం అని చెప్పారు. సూపర్ సిక్స్ ప్రకటిస్తే అసాధ్యం అన్నారని, సూపర్ సిక్స్‌లను సూపర్ హిట్‌గా అమలు చేసి చూపించామని చెప్పారు. పెన్షన్లు, తల్లికి వందనం సహా అన్ని పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఐదేళ్లలో ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తాం అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఈరోజు చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మాట్లాడుతూ… ‘చెడు చేసిన వ్యక్తిని ఎప్పుడూ మరచిపోకూడదు. 2024కు ముందు రాష్ట్రం అతలాకుతలం అయ్యుంది. నోటీసులు కూడా ఇవ్వకుండా నన్ను రాత్రికి రాత్రే అరెస్టు చేశారు. ఐదేళ్లుగా కనీసం మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి, నవ్వాలన్నా నవ్వలేకపోయారు, అంత భయంకరమైన పాలన ఐదేళ్లు సాగింది. ఒక రాక్షస పరిపాలన ఐదేళ్లు సాగింది. మూడు పార్టీలు కలసి రాష్ట్ర కోసం పనిచేసాం. చాలాసార్లు సీఎం అయ్యా కానీ.. ఎప్పుడూ ఇంతలా అభివృద్ధి నేను చేయలేదు. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించాం. ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు.. మన జీవన విధానం కావాలి. మనం పీల్చే గాలి, మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read: Chiranjeevi Hits: రీ-ఎంట్రీలో చిరంజీవి హిట్స్.. ఈ ఆసక్తికర విషయం తెలుసా?
‘భూ సమస్యలు గత ఐదేళ్లుగా భూతంలా పట్టిపీడించాయి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. పట్టాదారు పాసు పుస్తకంపై ప్రభుత్వ రాజముద్రతో అందిచాం. నాఫోటో, ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటో ఉందా. వైఎస్ జగన్ ఎమైనా గోప్పోడా ఫోటో వేసుకోవడానికి. మీ భూమీని సర్వే చేసి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఫోటోలు చేసుకున్నాడు. శాశ్వతంగా మీ పోలంలో ఉండాలనుకున్నాడు కానీ.. మీరు వద్దని తరిమేశారు. మా నాయనతో పనిచేశాడు, నాతో పోటీపడలేకున్నాడని ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నాడు. అలాంటి చెత్త పనులు నేను చేయాలా?. వచ్చే ఎన్నిక నాటికి నగరికి కృష్ణా జలాలు అందిస్తాం. కోసల నగరాన్ని పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తాం. నగరి యువతకు ఉపాది ఇక్కడే కల్పిస్తాం. అమరావతిని శ్మశానం అని మూడు ముక్కల ఆట ఆడారు. నామీద నమ్మకంతో మీరు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా. ఎంతమంది అడ్డుకున్నా అమరావతి రాజధానిగా ఉంటుంది..శాశ్వతంగా ప్రపంచం మెచ్చే రాజధానిగా అభివృద్ధి చెందుతుంది. దేవుడు ఒక్కొక్కరికి ఓ అవకాశం ఇస్తాడు. అప్పుడు హైదారాబాద్, ఇప్పుడు అమరావతి.. నాకు దేవుడు ఇచ్చిన అవకాశం’ అని సీఎం చెప్పారు.