CM Chandrababu: అమరావతి వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన మీడియా సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, విభజన ప్రభావాలు, పరిశ్రమల పురోగతి, వ్యవసాయ సవాళ్లు, నేరాల నియంత్రణ, అలాగే ఇటీవల చోటుచేసుకున్న వివాదాస్పద సంఘటనలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల విభజన ప్రభావం ఇంకా కొనసాగుతుందని అంటూ.. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ కు వ్యవస్థీకృతంగా ఇబ్బందులు వచ్చాయని, 25 ఏళ్ల క్రితం తెలంగాణాలో అమలైన పాలసీలు ఆ రాష్ట్రానికి ఇప్పుడు ఆదాయం అందిస్తున్నాయని వ్యాఖ్యానించారు. విభజన తర్వాత వచ్చిన సమస్యలను సరిచేసే సమయంలో వైసీపీ ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని మరింత నష్టపరిచిందని ఆరోపించారు. ఇంకా తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించాలని తాను ఎప్పుడూ కోరుకుంటున్నానని తెలిపారు.
T20 World Cup 2026: ఐసీసీకి గట్టి జలక్ ఇచ్చిన జియోహాట్‌స్టార్.. దెబ్బ మామూలుగా లేదు కదా!
అలాగే గత ప్రభుత్వంలో అధిక వడ్డీకి తెచ్చిన అప్పులను రీషెడ్యూల్ చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పరిశ్రమల రంగంలో గణనీయమైన వృద్ధి నమోదైందని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విద్యుత్, మౌలిక వసతుల మెరుగుదల వల్ల పెట్టుబడులు ఆకర్షించినట్టు తెలిపారు. నీటి భద్రత, అగ్రిటెక్, లాజిస్టిక్స్ ఖర్చు తగ్గింపు, డీప్ టెక్ వంటి 10 ప్రధాన సూత్రాలను అమలు చేస్తున్నామని,
వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టామని మాట్లాడారు.
ఈ ఏడాది 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, ప్రజలు తినే ఆహారానికి అనుగుణంగా పంటల పెంపకం ద్వారా రైతులకు మరింత లాభం చేకూరేలా చేస్తున్నామని అన్నారు. రైతుల్లో అవగాహన పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. ఉద్యాన, ఆక్వా రంగాలను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అగ్రిటెక్ అమలు జరుగుతోందని వెల్లడించారు. దీనితో 9 రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
టీటీడీ వివాదం, దేవాలయాల పవిత్రతపై స్పందిస్తూ.. దేవుడి డబ్బుల కాపలా దారులు తప్పులు చేస్తే ప్రజలు ఎలా నమ్ముతారని అన్నారు. ఒక వ్యాపారి 122 కోట్లు బంగారం విరాళంగా ఇచ్చారని, భక్తుల విశ్వాసమే దీనికి ఉదాహరణ అని, గత ప్రభుత్వంలో ప్రసాదాల నాసిరకం నాణ్యతపై వ్యాఖ్యానిస్తూ, తన ప్రభుత్వం సమయంలో అన్ని నాణ్యతా ప్రమాణాలు పెంచామని ఆయన అన్నారు. అలాగే ఇటీవలి సంఘటనలను రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరమని, సింగయ్య ఘటనలో బాధితుల్ని ఒత్తిడి చేసి మేనేజ్ చేశారని ప్రతిపక్షాలను ఆరోపించారు. ఇంకా పాస్టర్ మృతి కేసులో కూడా వాస్తవాలు వక్రీకరిస్తున్నారని తెలిపారు.
CM Chandrababu: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోండి.. సీఎం ఘాటు వ్యాఖ్యలు..!
రాష్ట్రంలో చట్టం, శాంతి భద్రతపై ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు శాంతి భద్రత కలిగిన నగరం కానీ గత ప్రభుత్వం కారణంగా అక్కడ నేరాలు పెరిగాయని.. రాయలసీమలో ఫ్యాక్షన్, తెలంగాణాలో నక్సల్స్, తూర్పుగోదావరిలో ప్రశాంతత వంటి గత నేపథ్యాలను ప్రస్తావించారు. చివరగా ఇండిగో విమానాల రద్దుపై మాట్లాడుతూ.. పైలట్లకు విశ్రాంతి అవసరం, కానీ ఇండిగో ప్రమాణాలు పాటించలేదని అన్నారు. టైం ఇచ్చినా సమస్యను పరిష్కరించలేకపోయారని, దీనివల్ల ప్రజలకు అసౌకర్యం కలిగినందుకు కేంద్రం కూడా దృష్టి పెట్టిందని అన్నారు. ముఖ్యంగా ఇండిగో మోనోపాలీ వల్ల సమస్యలు తీవ్రతరం అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.