CM Chandrababu Naidu: ఆనాడు శపథం.. రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు..
- రెండేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు
- తనను అన్ని రకాలుగా అవమానించిన ఈ సభలో విపక్ష నేతగా ఉండలేను అంటూ 2021లో సభ నుంచి వెళ్లిపోయిన చంద్రబాబు
- రెండేళ్ల తర్వాత సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు
- తొలుత శాసన సభ మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Naidu: రెండేళ్ల క్రితం శపథం చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నుంచి వెళ్లిపోయిన అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు.. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో రెండేళ్ల తర్వాత అదే సభలో అడుగుపెట్టారు.. ఈ సందర్భంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.. తనను అన్ని రకాలుగా అవమానించిన ఈ సభలో విపక్ష నేతగా ఈ కౌరవ సభలో ఉండలేను.. మళ్లీ గెలిచి గౌరవ సభలో అడుగుపెడతానంటూ 2021లో సభ నుంచి వెళ్లిపోయిన ఆయన.. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. శాసనసభకు చేరుకున్నారు.. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు స్వాగతం పలికారు.. ఇక, తొలుత శాసన సభ మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు. అనంతరం శాసనసభాపక్ష నేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు.. ఆ తర్వాత శాసన సభలో అడుగుపెట్టారు చంద్రబాబు.
అయితే, 2021 నవంబర్ 19వ తేదీ తర్వాత చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇదే తొలిసారి.. ఇన్నేళ్లు తాను పరువు కోసం బతికాను. అలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ.. ఇలాంటి సభలో నేనుండను.. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను.. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు.. మీ అందరికీ ఓ నమస్కారం.. అంటూ శపథం చేసి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు చంద్రబాబు.. అప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగినా.. ఆయన సమావేశాలకు వెళ్లింది లేదు.. కానీ, ప్రజాక్షేత్రంలో వైసీపీపై పోరాటం చేస్తూనే వచ్చారు.. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-బీజేపీతో కలిసి పోటీ అఖండ విజయాన్ని అందుకున్నారు.. అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌లోనూ కీలకంగా మారారు.. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టిన చంద్రబాబు.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!